Chandrababu :  తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా...మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి   చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు.  రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందు కోసం  పంచసూత్రాల ను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.    గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూలో జరిగిన అవకతవకలపై మరింత ఫోకస్ పెడుతున్నాను. జగన్ మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ గోల్మాల్ ను సరి చేసేందుకే ఎక్కువ సమయం పెడుతున్నాను. గత పాలకులు భూముల విషయంలో చాలా దౌర్జన్యాలు చేశారు. తాము కోరుకున్న భూములు ఇవ్వకుంటే వాటిని 22-ఏ లో పెట్టేశారు.  వీటన్నింటినీ సరి చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను. గత ప్రభుత్వం వైఖరి వల్ల రాష్ట్ర మొత్తం విధ్వంసానికి గురైంది... అభద్రతా భావంలోకి వెళ్లిపోయారు.  వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని నాటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసిందని గుర్తు చేశారు. 

Continues below advertisement

గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించేలా తీర్పును ప్రజలు ఇచ్చారు. గతానికంటే రెండు రెట్లు అభివృద్ధి-సంక్షేమం చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చాను. నాడు చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం... అన్నదాత సుఖీభవ అమలు చేశాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... అందరికీ రూ. 15 వేలు ఇచ్చాం. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం... మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం-2.0 పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నాం. అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమం ఇస్తున్నాంమన్నారు. 

గోతుల పడ్డ రోడ్లను పూడుస్తున్నాం.. సంక్రాంతి నాటికి రోడ్లపై గోతులు లేకుండా చేస్తాం చరిత్రను గుర్తు పెట్టుకోవాలి... భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  విభజన, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా మారిందని..  టీడీపీ జెండాలో నాగలి గుర్తు ఉండేలా ఎన్టీఆర్ జెండా రూపకల్పన చేశారన్నారు.  వ్యవసాయమే మన బలం... దాన్ని మరింత బలపరుచుకోవాలన్నారు.  వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసుకునేలా పంచసూత్రాలను అమలు చేస్తున్నాం... పంచసూత్రాలను ప్రతి రైతూ ఆచరించాలి. వృధాగా సముద్రంలోకి పోతున్న జలాలను వినియోగించుకునేలా నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టామని తెలిపారు.   

Continues below advertisement

తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని పోలవరం ద్వారా నీరందరిస్తామన్నారు.  పంచసూత్రాల మీద అవగాహన కల్పించేందుకే రైతన్నా... మీ కోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రచారం చేపట్టాం. రైతులకు సాగులో ఆదాయం రావాలి. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం అవసరం. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చాను... దానికి అనుగుణంగానే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే... నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.