CM Chandrababu Family Sankranti Celebrations In Naravaripalle: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కుటుంబంతో సహా రెండో రోజు స్వగ్రామమైన నారావారిపల్లెలో (Naravaripalle) సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. నాగాలమ్మపుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేశ్ (Loeksh), బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆధునికతను సంతరించుకున్నప్పటికీ సంప్రదాయాలను ఒడిసి పట్టాలని సూచించారు. అంతకు ముందు గ్రామంలోని తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రెండో రోజు కూడా గ్రామస్థులు చంద్రబాబుకు ఆర్జీలు సమర్పించారు. వారిని కలిసి సమస్యలను సావధానంగా విన్నారు.

కాగా, తొలి రోజు భోగి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ భువనేశ్వరి రూ.10 వేల చొప్పున సంక్రాంతి  కానుక అందజేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు. అలాగే, నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరుకులు అందనున్నాయి. అనంతరం గ్రామంలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.

Also Read: Pigs Fighting: సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?