మాతృభాష మనిషి అభివృద్ధికి కారణమవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. చైనా, జపాన్ దేశాలు పరాయి భాష మోజులో పడలేదని తెలిపారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వాటి మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. తెలుగు భాష గతంలో ఎన్నడూ లేనంత ప్రమాద పరిస్థితులు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషా పరిరక్షణకు భాషాభిమానులందరూ తోడ్పలని కోరారు. గిడుగు వేంకట రామమూర్తి పంతులు 158వ జయంతి సందర్భంగా ‘వీధి అరుగు’ నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలుగు భాషాదినోత్సవం-2021’ కార్యక్రమం ఏర్పాటుచేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల్లోని 75కిపైగా తెలుగు సంస్థలు పాల్గొంటున్నాయి. శనివారం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Also Read: Covid: పాఠశాలలను వెంటనే తెరవండి.. లేదంటే ముప్పు తప్పదు.. కేంద్రానికి నిపుణుల లేఖ


గిడుగు రామ్మూర్తి పంతులు అగ్రగణ్యుడు


తెలుగు సమాజం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ  భాషలో దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకుని మనుగడ కొనసాగిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషలో తగు మార్పులు రావాలని ముందు చూపుతో వ్యవహరించిన వారిలో మొదటి వరుసలో ఉంటారు గిడుగు రామమూర్తి పంతులు అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు సాహితీ సంస్కరణలతో తెలుగు భాషను వ్యవహరిక భాషగా మలిచారని కొనియడారు. భాష అనేది స్వాతంత్య్రానికి, స్వేచ్ఛకు సంకేతమని, మానవ సంబంధాలకు ఆధారమని ఆయన పేర్కొన్నారు. 


Also Read: Petrol-Diesel Price, 29 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరంలో భారీగా..


సోషల్ మీడియా భాషతో


సోషల్ మీడియా విస్తృతమవ్వడంతో భాషలో మార్పులు రావడానికి మన వంతు పాత్ర పోషిస్తున్నామని జస్టిస్ రమణ అన్నారు. భాషను వధిస్తున్నామని ఆవేదన చెందారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌ చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని తెలిపారు. నేటికీ వార్తాపత్రికలు తెలుగు భాషకు తగిన ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొన్నారు. తాను తెలుగువాడినని, తన మాతృభాష తెలుగని చెప్పుకోడానికి గర్విస్తానని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. 


Also Read: Horoscope Today : ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించవద్దు…ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి బావుంటంది


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు