Court closed the liquor case filed against Chandrababu Naidu:  వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబుపై పెట్టిన మరో కేసు కోర్టులో తెలిపింది. లిక్కర్ పాలసీ అక్రమాల కేసులో దర్యాప్తు పూర్తయినట్లుగా సీఐడీ కోర్టుకు తెలిపింది. అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలేమీ లేకపోవడంతో కేసును క్లోజ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.  

Continues below advertisement

ఇదీ కేసు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలో ఉన్న సమయంలో   2023 అక్టోబర్ 30న  ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. 2014-19  మధ్య   ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు, డిస్టిలరీలకు అర్హత లేకపోయినా  లైసెన్సులు ఇవ్వడం, కొంతమంది సప్లయర్లకు ప్రయోజనాలు  కల్పించారని కేసులు నమోదు చేశారు.  సీఎంగా ఉన్న సమయంలో  మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని  సీఐడీ అభియోగాలు మోపింది. పీసీ యాక్ట్ తో పాటు  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కొన్ని మద్యం తయారీ సంస్థలకు  ప్రయోజనం చేకూరేలా  చంద్రబాబు సర్కార్  వ్యవహరించిందని  ఏపీ సీఐడీ  కేసు నమోదు చేసింది. ఈ మేరకు  ఏపీ బేవరేజేస్  ఎండీ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో  ఏ1 గా సుధాకర్, ఏ2 కొల్లు రవీంద్, ఏ3 చంద్రబాబు పేర్లను  ఏపీ సీఐడీ  నమోదు చేసింది.              

Continues below advertisement

వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి  వచ్చినప్పటికీ 2023లో రెండు  బేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని అప్పటి ఏబీ బేవరేజెస్ ఎండీ ఫిర్యాదు చేశారు.  కొన్ని మద్యం తయారీ సంస్థలకు  ప్రయోజనం కలిగేలా  2012 ఎక్సైజ్ పాలసీని మార్చారని ..  2015లో  కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకు వచ్చిన ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సంస్థ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.   అయితే అప్పటి , ఇప్పటికి బేవరేజెస్ ఎండీలు..  ఎలాంటి అవకతవకలు జరగలేదని.. ఆధారాల్లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆధారాలు లేని విషయాన్ని సీఐడీ కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు మూసివేసింది. 

ఇటీవలే చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన  ఫైబర్‌నెట్ కేసును కూడా కోర్టు మూసివేసింది.  ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సీఐడీ  దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఫైబర్‌నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మధుసూదన రెడ్డి, ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ   ఏసీబీ కోర్టుకు హాజరయ్యి.. సీఐడీ సమర్పించిన తుది నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని, కేసు మూసివేతకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు లిఖితపూర్వకంగా, మౌఖికంగా కోర్టుకు  తెలిపారు. దాంతో కేసును  కోర్టు మూసివేసింది.