Mla Karanam Dharmasri : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తప్పనిసరిగా చేపట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్ట్రాంగ్ గానే చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ఇది అంత సులువుగా మాత్రం కావడంలేదు. పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీస్తుంటే మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్న సీఎం జగన్ ఆదేశాలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గడప తొక్కాల్సిందే అని నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీకి మాత్రం వింత కష్టాలు వచ్చాయి. ఆయన నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో ఇక అశ్వమే శరణ్యం అనుకున్నారు. గుర్రంపై ఎక్కి ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు సాహనం చేశారు.  


గుర్రంపై గడప గడపకూ ఎమ్మెల్యే 


అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆదివారం ఆయన రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ అర్ల పంచాయతీకి చెందిన లోసంగి, పీతురు గడ్డ,పెద గరువు, గుర్రాల బైల, గదభ పాలెం గ్రామాల్లో పర్యటించారు.  అయితే ఈ గ్రామాలు కొండ ప్రాంతాల్లో ఉండడంతో ఎమ్మెల్యే గుర్రం ఎక్కి ప్రజల వద్దకు వెళ్లారు. గుర్రంపై లోసంగి గ్రామం చేరుకుని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర గుర్రం మీద ప్రయాణించిన ఎమ్మెల్యే  గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే తమకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. రోడ్డు లేకపోవడంతో ఎంత కష్టపడాలో స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే... త్వరలో కొండపైకి రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గుర్రంపై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి తమ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక యువత ఘనంగా స్వాగతం పలికారు. 


మా కష్టాలు తెలిశాయా అంటూ కౌంటర్ 


అయితే కొందరు మాత్రం కొంచెం ఘాటుగా స్పందించారు. తమ కష్టాలు ఇప్పుడు అర్థమయ్యాయా అంటూ వ్యాఖ్యానించారు. కొండలు దిగి ఎక్కడానికి తమ వద్ద గుర్రాలు లేవన్నారు. రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని, వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. త్వరలో కొండపైకి రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో రహదారుల లేక ప్రజలు నానాఅవస్థలు పడిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. వైద్యం, నిత్యవసర వస్తువుల కోసం గిరిజనులు కాలినడకన కొండలు గుట్టలు దాటి వందల మైళ్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. అత్యవసర సమయాల్లో అయితే మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు స్థానికులు. రహదారులు లేకపోవడంతో అంబులెన్స్ వచ్చేందుకు అవకాశం ఉండదు దీంతో డోలీల సాయంతో కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదనచెందుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధుల తీవ్ర అవస్థలు పడుతుంటారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని