Kodela Shivaram: దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంపై  చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు.. కోడెల శివరాంపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వివరించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అధికారులు కోడెల శివరాంపై కేసు నమోదు చేశారు. అయితే కోడెల శివరాంకు చెందిన ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. 


ఐదేళ్లవుతున్నా అస్సలే స్పందిచట్లేదు.. అందుకే


ఇందుకు సంబంధించిన ప్రతిఫలంతో పాటు తమ పెట్టుబడి డబ్బులు 2017లో ఇవ్వాలంటూ ఒప్పందం కూడా చేసుకున్ననారు. అయితే సునీత, వెంకట సురేష్ లు డబ్బులిచ్చి ఏడాది గడవడంతో.. శివరాం వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించమని అడిగారు. ఎన్ని సార్లు అడిగాను వారు స్పందించకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడంతో.. బాధితులు విసిగిపోయారు. దాదాపు ఐదేళ్లపాటు వేచి చూసినా కోడెల శివరాం స్పందించలేదు. దీంతో సునీత, వెంకట సురేష్ లు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్సై జి. ఏడుకొండలు.... కోడెల శివరాంపై కేసు నమోదు చేశారు.


కోర్టు ఆదేశాల మేరకు చీటింగ్ కేసు నమోదు..


వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ జి. ఏడుకొండలు శివరామ్ పై చీటింగ్ కేసును  నమోదు చేశారు. 


గతంలోనూ శివరాంపై పలు కేసులు..


గుంటూరు జిల్లా నగరంపైలెం పోలీస్ స్టేషన్ లో కూడా శివరాంపై ఓ వ్యక్తి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైన్ షాపు విషయమై 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన వెంటక పద్మారావు ఆరోపించారు. 2015 బిడ్స్ లో తనకు దక్కిన మద్యం దుకాణాన్ని కొనసాగించాలంటే.. కచ్చితంగా డబ్బులు చెల్లించాలంటూ శివరాం బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2017లోనూ కోడెల శివరాం ఇలానే వ్యవహరించాని చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పద్మారావు నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


వీరిలాగే మరో పది మంది కూడా కోడెల శివరాం తమ నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ లో అకారణంగా డబ్బులు వసూలు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని.. ఇలా అనేక రకాల కారణాలతో మొత్తం 10 ఫిర్యాదులు అందాయని పోలీసుల తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశఆల మేరకు కేసులు నమోదు చేశారు. ఇలా శివరాంపై చాలా మందే ఫిర్యాదులు చేశారు. మరోసారి తాజాగా బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయింది.