Chandrababu :  పశ్చిమగోదావరి జిల్లా అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు.పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని అందులో పేర్కొన్నారు. 1950 నుంచి దాదాపు 3,255 ఎకరాల భూమి అటవీశాఖ అధీనంలో ఉందని, కానీ, సంబంధిత శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కొంత భూమిని సాగుభూమిగా ప్రకటించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై కోర్టుల్లో వివాదం నడుస్తోందన్నారు.''భూమి తమ అధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారసులు కోర్టుకెక్కారు. యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులున్నా పనులు చేస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి, బోరు బావులు తవ్వుతున్నారు.             
 
అల్లంచెర్లరాజుపాలెం గ్రామంలోని పాత సర్వే.నెం.453లో పర్యావరణ పరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతం అవుతోంది. అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతం కింద 3255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీ శాఖ అధీనంలో ఉంది. అటవీ శాఖ అధికారులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులు కొంతమేర అటవీ భూమిని గతంలో సాగుభూమిగా ప్రకటించారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు నాడు తీసుకున్న నిర్ణయంపై కోర్టులలో వివాదం నడుస్తుందని లేఖలో చంద్రబాబు తెలిపారు.  దీన్ని ఆసరాగా చేసుకుని తాజాగా అల్లంచెర్ల రాజుపాలెం పాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలోని 226, 227, 231, 232, 233 సర్వే నంబర్లలోని భూమి తమ ఆధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారి వారసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేస్తున్నారని చ్రబాబు గుర్తు చేశారు.                                  


 భూమి తమ ఆధీనంలో ఉందని చెప్పుకోవడం కోసం ఇలాంటి పనులు చేసి..  తర్వాత దాన్నే సాక్ష్యంగాచూపి దానిని అటవీ భూమిగా ప్రకటించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తప్పుడు వాదనలకు దిగుతున్నారని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తసుకెల్లారు.  అటవీ భూముల అక్రమణకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు, అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.  ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.                


 క్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలి. వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలి. భూ కబ్జాదారులను నుంచి అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి అక్కడ నిరంతరం నిఘా ఉంచాలి. అల్లంచెర్లరాజుపాలెం ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.