Chandrababu said that there is no communism and socialism: ఆల్ ఇజమ్స్ ఓవర్.  కమ్యూనిజం.. సోషలిజం ఏమీ ఉండవు టూరిజం మాత్రమే ఉంటుందని ఎప్పుడో చెప్పాను. ప్రపంచం అంతా అదే జరుగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మట్లాడారు. ఈ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీ ప్లేన్   ఒక వినూత్నమైన ప్రయాణమని. రాష్ట్రానికి టూరిజం ఒక వరంగా  చంద్రబాబు చెప్పారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచే విధంగా పని చేస్తున్నామన్నారు.  తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్‌’ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందన్నారు.. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.                      


Also Read: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు


రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.  ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాం. ప్రజలు గెలిపించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పని చేస్తామని స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎం అయ్యా. మొదటి సార్లు అంత కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు ధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  కూటమి నుంచి ఎవర్ని నిలబెడితే వారిని గెలిపించారు. రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద నుంచి కాపాడారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టేందుకు నిద్రపోకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు. 



గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోనని ప్రకటించారు.  రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని..   ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనేదే  తమ ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు.  గాడితప్పిన పరిపాలనను సరిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలోని రోడ్లను చూసి అవహేళన చేశారు. పొగొట్టిన బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. 




ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రసంగించారు. సీప్లేన్ ప్రాజెక్ట్ గతంలో కరోనా వల్ల ముందుకు సాగలేదు. కానీ ఈ సారి మాత్రం మంచి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు పట్టుబట్టి ఈ ప్రాజెక్టును సాకారం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ లక్ష్యానికి నా పూర్తి సహాయసహకారాలు అందిస్తానని ప్రకటించారు. తర్వాత చంద్రబాబు అదే సీ ప్లేన్‌లో శ్రీశైలం వెళ్లారు.       


Also Read: జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్