Chandrababu Naidu on alert to face cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మొంథా ప్రభావాన్ని వీలైనంత తక్కువ చేసి.. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.  రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) కమాండ్ సెంటర్‌లో  . మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో కలిసి తుఫాను పరిస్థితి, సన్నద్ధతలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గంటకు గంట పెరుగుతున్న తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, 'జీరో రిస్క్' చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు  తీర, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను రిలీఫ్ క్యాంపులకు మార్చారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, అవసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. మొత్తం 2,707  తుపాను ప్రభావిత గ్రామాలను గుర్తించారు.  3,211 జెనరేటర్లను ఆయా ప్రాంతాలకు పంపించారు. మండల్ స్థాయి స్టాక్ పాయింట్లలో బియ్యం, నిత్యావసరాలను రెడీగా ఉంచారు.  11 NDRF, 12 SDRF టీమ్స్, ఫైర్ సర్వీసెస్, స్విమ్మర్లు, OBM బోట్లు, లైఫ్ జాకెట్లు అవసరమైన ప్రాంతాలకు పంపించారు.   108/104 అంబులెన్స్ నెట్‌వర్క్, మెడికల్ క్యాంపులు సిద్ధంగా ఉంచారు.  ఎమర్జెన్సీ  మెడిసిన్స్, బోట్ క్లినిక్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్స్ ను మొబిలైజ్ చేశారు.                                 

Continues below advertisement

RTGS వార్ రూమ్ 24x7 ఆపరేషనల్ గా ఉంటుంది. శాటిలైట్ ఫోన్లు, V-SATలు, డిజిటల్ రేడియోల ద్వారా గంట వారీ బులెటిన్లు  మంగళవారం ఉదయం నుంచి  ప్రకటిస్తారు. రిజర్వాయర్లు, డ్రైనేజ్ సిస్టమ్స్ మానిటరింగ్ చేస్తారు. తుపాను వల్ల చెట్లు పడిపోతే.. రోడ్లు ధ్వంసం అయితే వెంటనే బాగు చేసేందుకు  851 JCBలు, 757 పవర్ సాస్, డీవాటరింగ్ పంపులు. ఎనర్జీ ర్యాపిడ్ రెస్టోరేషన్ టీమ్స్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు, పోల్స్, జనరేటర్లు సిద్ధం చేశారు.  RWS ట్యాంకర్లు, క్లోరిన్ టాబ్లెట్లు, బ్లీచింగ్ పౌడర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ బ్యాకప్ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

Continues below advertisement

IMD ప్రకారం, 'మోంథా' ప్రస్తుతం 560 కి.మీ. దూరంలో విశాఖపట్నం నుంచి, 18 కి.మీ./గం వేగంతో కోస్ట్ వైపు పయనిస్తోంది.  90-100 కి.మీవేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.  మచిలీపట్నం-కాకినాడ మధ్య  తీరం దాటనుంది.  కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఎన్‌టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ-అతి భారీ వర్షాలు, గాలులు ఉంటాయి.  ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు పడతాయి.