Chandrababu Naidu Business Reformer of the Year:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు   ప్రతిష్టాత్మక  బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్  అవార్డు లభించింది.    భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డును చంద్రబాబుకు ఇవ్వాలని నిర్ణయించింది.  రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం, పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం వంటి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

Continues below advertisement

కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అవార్డు ప్రకటన గురించి ప్రస్తావించారు.  అవార్డును అందుకున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరపున అభినందనలు తెలిపారు.  సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ అవార్డు ప్రకటించడం దేశం మొత్తం చర్చనీయాంశమైందని పయ్యావుల కేశవ్ తెలిపారు.  ఈ రాష్ట్రం గతంలో దాదాగిరిని చూసింది... అభివృద్ధికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నాయుడుగిరిని చూస్తోంది.. అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది.  సంస్కరణలు చేపట్టాలంటే చాలా ధైర్యం కావాలి.. సీఎం చంద్రబాబుకు టన్నుల కొద్ది ధైర్యం ఉంది.  మొత్తంగా కూటమి పాలనలో 25 కొత్త పాలసీలు తెచ్చారని గుర్తు చేశారు. 

ప్రతి రోజూ కొత్తరకంగా ఆలోచన చేయాలనే సీఎం చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జనరేషన్ ముందే ఆలోచిస్తారని పయ్యావుల కేశవ్ అన్నారు.  ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకుంది మొదటి రాష్ట్రం నాడు ఏపీని నిలిపారు.  పవర్ సెక్టార్ రిఫామ్స్ తెచ్చింది చంద్రబాబేనన్నారు.  దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డును ప్రకటించింది.  ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వాళ్లకే ఈ ఆవార్డు ఇచ్చారు... ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి తొలిసారిగా ఇచ్చిందని.. సీఎంతో కలిసి పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని పయ్యావుల అన్నారు  ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనన్నారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు.  మనం ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నాం.  ప్రతీ నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేశామన్నారు.  పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు... ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ  మరువకూడదు.   ద్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా ఆని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.  రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రమూ తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చాం... దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తాం. లేబర్ కోడ్ గైడ్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించింది.  అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. .

Continues below advertisement