YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్‌తో సమావేసం కానున్నార. లోక్‌భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని రిక్వస్ట్ చేయనున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేసిన ఉద్యమాలకు చాలా మద్దతు వచ్చిందని, ప్రజలు సంతకాలు పెట్టిన ప్రతులను ఆయనకు అందజేయనున్నారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లెలో కూడా ప్రజలు సంతకాలు చేశారని చెప్పనున్నారు.           

Continues below advertisement

Continues below advertisement

మెడికల్ కాలేజీలు ప్రైవేటికరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు నెలల క్రితం వైసీపీ ఉద్యమం చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా చాలా రకాలుగా నిరసనలు తెలిపింది. అందులో భాగంగా ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించింది. రెండు నెలల్లోనే కోటీ 4 లక్షల 11వేల 136 మంది సంతకాలు చేశారని వైసీపీ చెబుతోంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని వివరించింది. వివిధ దశల్లో ఈ సంతకాలు చేసిన ప్రతులను తాడేపల్లికి చేర్చారు. ఆ ప్రతులను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. 

కోటి సంతకాల సేకరణపై వస్తున్న విమర్శలను వైసీపీ నేతలు  తిప్పికొట్టారు. పీపీపీతో వైద్య, విద్య పూర్తిగా ప్రైవేటుపరమైపోతుందని అన్నారు. అందుకే దీన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలిపారని అందుకే నిదర్శనమే కోటి సంతకాలని చెప్పారు. ఈ ప్రజాస్పందన చూసైనా ప్రభుత్వం తన నిర్ణయంలో వెనక్కి తగ్గాలని సూచించారు. 

ఇది ప్రజల నుంచి పుట్టిన ఉద్యమని వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలని జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదని, వాటిని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ లేనిపోని అపోహాలను ప్రజల్లో కల్పించేందుకు ఉద్యమాల పేరుతో కన్ఫ్యూజ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. గ్రామాల్లో సిమెంట్ రోడ్డులను ప్రైవేటు వ్యక్తులే డెవలప్ చేస్తున్నారని, ఆ రోడ్లు వారివి అయిపోతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీల్లో సేవలు మెరుగుపడతాయని అంటున్నారు. పేద వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాదని చెబుతున్నారు.