Kuppam Chandrababu :  చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ..టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచుకొన్నారు. కుప్పం మాజీ ఎమ్మెల్యే బి. ఆర్ దొరస్వామి నాయుడు తనయుడు డాక్టర్ సురేష్ బాబు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చురుకైనా పాత్ర పోషించారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి కుప్పం, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ, గత అసెంబ్లీ ఎన్నికలల్లో కుప్పం నుండి చంద్రబాబు పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  కుప్పం నియోజకవర్గంలో విస్తృత పరిచయలు కల్గిన డాక్టర్ గా సురేష్ బాబు సుపరిచితులుగా ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకోనేందుకు సిద్దమై టిడిపి ఆహ్వానించింది. 


డా. సురేష్ బాబు అనుచరులు, బి ఆర్ డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ..సురేష్ బాబును తెలుగుదేశం పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. సురేష్ బాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు.కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా...ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. సందప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తామన్నారు. ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.              
  
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవ్రగంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.  పర్యటించనున్నారు. ఎప్పుడూ తన పర్యటనలో గ్రామాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ, జనాలతో మమేకమయ్యేవారు. ఈసారి మాత్రం పార్టీ శ్రేణులతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  కుప్పంలోని బీసీఎన్‌ కల్యాణ మండపంలో నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.    కుప్పం నియోజకవర్గంలో టీడీపీ తరపున గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సమన్వయ కమిటీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంకోసం చంద్రబాబు ఈ పర్యటనను పెట్టుకున్నారు.          


బూత్‌ స్థాయినుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలదాకా వేర్వేరుగా సమావేశాలు జరుగనున్నాయి. ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత నిబద్ధతతో, బాధ్యతతో గెలుపుకోసం కృషి చేయాలో పార్టీ శ్రేణులకు చంద్రబాబు తెలియజెప్పనున్నారు. పార్టీ శ్రేణులు లక్ష మెజారిటీ లక్ష్యం గురించి ప్రెస్మీట్లు, సమావేశాల్లో చెప్పడం కాదు.. నిరంతరం ప్రజల్లో ఉండడమే ఏకైక మార్గమని చాలాసార్లు చంద్రబాబు వారికి స్పష్టంచేశారు. ఈ మార్గాన్ని తప్పనిసరిగా వారిచేత అమలు చేయించడానికి అవసరమైన దిశానిర్దేశం చేయడమే ప్రధాన కర్తవ్యంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది.