Pithapuram TDP Janasena Issue: పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రాజుకున్న  ఫ్లెక్సీ వివాదం చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి చేరింది. కూటమి నేతల మధ్య సమన్వయం దెబ్బతినడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటో ఉంది కానీ చంద్రబాబు ఫోటో లేదని టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం దుమారం రేపింది. జనసేన నేత దొరబాబుతో రాజకీయ శత్రుత్వం ఉండటంతో వర్మకు ఆయనతో పొసగడం లేదు.  

Continues below advertisement

ఈ వివాదంపై సమాచారం అందుకున్న చంద్రబాబు నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్  తో ఫోన్లో మాట్లాడారు. పిఠాపురం ఇంచార్జ్ వర్మ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏమైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకు రావాలి కానీ ఇలా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.                              పిఠాపురం అనేది రాష్ట్రానికే ఒక రాజకీయ నమూనా అని, అక్కడ ఇరు పార్టీల నేతలు పాలు-నీళ్లలా కలిసి ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.  చిన్న చిన్న ఫ్లెక్సీ గొడవలను పెద్దవి చేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని, వెంటనే వర్మతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. 

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ లింక్‌ను ఫాలో అవ్వండి

అసలేం జరిగిందంటే?                              

Continues below advertisement

మంగళవారం  PADA  కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కులు, సెల్ ఫోన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్లెక్సీలు ేర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోట లేదు. దీంతో కార్యక్రమం ప్రారంభం కాగానే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్లెక్సీ విషయంలో అధికారులను  నిలదీయడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన పాడా పీడీని ప్రశ్నించారు. అధికారులు వివరణ ఇస్తుండగా,  వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకున్నారు. ఫోటో పెట్టారని, ప్రతి చిన్న విషయానికి వివాదం చేయడం సరికాదని దొరబాబు అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో దొరబాబు వర్మపైకి దూసుకురావడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో వివాదం రెండు వర్గాల పోరాటంగా మారింది. పిఠాపురం పవన్ నియోజకవర్గం కావడంతో.. జనసైనికులు వర్మకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు వర్మను సమర్థిస్తున్నారు. ఈక్రమంలో వివాదం పెద్దది కాకుండా...  చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి