Chandrababu decided to recommend setting up a high court bench in Kurnool : కర్నూలులో హైకోర్టు పెడతామని దాన్నే న్యాయరాజధానిగా పిలుస్తామని ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదేళ్లలో కనీసం హైకోర్టు బెంచ్ కోసం కూడా సిఫారసు చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో కర్నూలులో హైకోర్టు అనే విధానాన్ని విరమించుకున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కర్నూలు న్యాయవాదుల డిమాండ్ ను తీర్చాలని అనుకుంటోంది. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాలని మఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. 


కర్నూలులో హైకోర్టు బెంచ్ చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్


అమరావతికి అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన తర్వాత.. అక్కడ జరుగుతున్న  పనులకు సంబంధించి జరిగిన ప్రచారంతో.. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది. అది టీడీపీ ఓటమికి కారణం అయింది. వైసీపీ ఈ రాజకీయాన్ని అర్థం చేసుకుని మూడు రాజధానుల విధానాన్ని గెలిచిన తర్వాత తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధానిని ప్రతిపాదించింది. అక్కడి జగన్నాథ గట్టులో హైకోర్టును నిర్మిస్తామని అప్పటి కర్నూలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ వాదనను ఎవరూ నమ్మలేదు. అన్ని సీట్లలో ఓడించారు. అయితే అక్కడి ప్రజల్లో ఉన్న కోరికను మాత్రం.. నెరవేర్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 



Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు



చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్


హైకోర్టు బెంచ్ అనేది పూర్తిగా సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు మాత్రమే పెట్టగలదు. కానీ ప్రత్యేక బెంచ్ అవసరం ఉందని గట్టిగా సిఫారసు చేస్తే మాత్రం అనుమతి లభించవచ్చు. చంద్రబాబునాయుడు ఈ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసి. తదుపరి కార్యాచరణను న్యాయశాఖకు అందించారు. రాజకీయంగా చంద్రబాబు ఈ సారి ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. భారతీయ జనతాపార్టీ, జనసేన కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ కు ఆమోదం తెలిపారు. అందరి సహకారంతో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గట్టి ప్రయత్నాలు చేస్తే రెండేళ్లలోపే కర్నూలులో హైకోర్టు బెంచ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. 


హీరోయిన్ జెత్వానీపై ముగ్గురు ఐపీఎస్‌ల కుట్ర - కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు


ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నంలో సీఎం


రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అమరావతిపై ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగని ఇతర ప్రాంతాలపై నిర్లక్ష్యం చేయలేదని.. అభివృద్ధి వికేంద్రీకరణ చేశామని.. పరిశ్రమల్ని రాయలసీమకు ఎక్కువగా వచ్చేలా చేశామని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ ప్రజల్లో ఆ వాదన ఎక్కువగా నిలబడలేదని ఫలితాలు నిరూపించాయి. ఈ సారి అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌కు చాయిస్ ఇవ్వకుండా చేయాలని అనుకుంటున్నారు. ప్రజల్లో ఎక్కువగా ఉన్న ప్రాంతీయ డిమాండ్ లను నెరవేర్చాలనుకుంటున్నారు. అందుకే హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.