Chandrababu on volunteers : వాలంటీర్ల తీరుతో పెను ప్రమాదం పొంచి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు. వాలంటీర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు దుమారం రేపుతున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెను ప్రమాదం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. వారిని పౌరసేవలకే పరిమితం చేయాలని అంటున్నారు. 


వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలకు చంద్రబాబు సమర్థన


వాలంటీల్ వ్యవస్థపై జనసేన చన చీఫ్  చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించినట్లయింది.  వాలంటీర్లు పౌరసేవలు అందించడం వరకూ .. పవన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం..  వ్యక్తిగత వివరాలు తీసుకోవడం.. ఓటర్లను భయపెట్టడం వంటివి చేస్తూండటంతోనే సమస్యలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు, పవన్ ఒకే అభిప్రాయంతో ఉన్నారు.                                 


వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ఘాటు విమర్శలు


హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ  అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  అందర్నీ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారని ఆరోపించారు.  కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నరు.  ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికేనన్నారు.  వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని గుర్తు చేశారు.  ఇది వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలని సూచించారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలుపై దుమారం రేగుతున్నా .. తన వాదనకే పవన్ కల్యాణ్ కట్టుబడ్డారు.  


వాలంటీర్లపై శ్రమదోపిడి 


వాలంటీర్ వ్యవస్థపై తనకు కోపం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి నుంచి శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పారు. ఏపీని తట్టి లేపుతున్నానని.. ఇందుకోసం తాను చనిపోయేందుకు సిద్ధం అని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. 30 వేల మంది మహిళలు మిస్ అయితే సమస్య కాదా అని అడిగారు. ఎవరు ఎవరితో తిరిగారు.. ఎవరు ఎవరితో పడుకున్నారా..? ఇవా సమస్యలా..? అని నిలదీశారు. ఏపీని పట్టి పీడిస్తోన్న జలగ జగన్ అని విమర్శించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, అతని మనస్తత్వం మారలేదని విమర్శించారు. అతను ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ అనే వాడు విప్లవకారుడు అని తెలిపారు. మీకు మీరు మద్దతు ఇచ్చుకోవాలని.. మీ బిడ్డలను.. ఆడబిడ్డలను సంరక్షించుకోవాలని సూచించారు. వాలంటీర్లపై హైకోర్టు వేసిన కొన్ని ప్రశ్నల వీడియోను పవన్ కల్యాణ్ షేర్ చేశారు.