Nellore TDP : ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి (YSRCP) జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) టీడీపీలో (TDP) చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్, మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రశ్నిస్తే వేధించడమే జగన్ పని !
ప్రశ్నిస్తే వేధించడమే జగన్ పని అని చేరిక సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు మండిపడ్డాు. ఆనం, కోటంరెడ్డిని జగన్ వేధించాడన్నారు. జగన్ తానొక్కడే రాజు అని అనుకుంటున్నారు .. మనమందరం ఆయన బానిసలమని భావిస్తారన్నారు. అహంకారంతో ఏపీని నాశనం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‍కు ఇంటికి పంపాలన్నారు. ఇది నా కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో, వేమిరెడ్డి కోసమో కాదని.. రాష్ట్రం కోసం , భావితరాల కోసం జగన్‍ను ఇంటికి పంపించాలన్నారు. రాష్ట్రం అంటే మట్టి కాదు.. రాష్ట్రం అంటే మనుషులన్నారు. విశాఖను ఊడ్చేసిన వ్యక్తిని ఇప్పుడు నెల్లూరుకు పంపిస్తున్నారని.. విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించార.ు
నెల్లూరు వైసీపీ ఖాళీ
ఏ1 విజయసాయిరెడ్డి విశాఖను దోచేశాడని ఇప్పుడు నెల్లూరు వస్తున్నారని విమర్శించారు. నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోయింది వైసీపీ నాయకులు వరుసగా టీడీపీ చేరుతున్నారన్నారు. తానే స్వయంగా నెల్లూరు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే అది వేమిరెడ్డికి ఉన్న ప్రత్యేకత అని అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది .. నెల్లూరులో ఒక వైసీపీ నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు .. ఇప్పుడు ఆ నాయకుడిని తన్నితే 3 జిల్లాల అవతల పడ్డాడని అనిల్ కుమార్ యాదవ్ గురించి వ్యాఖ్యానించారు. బుల్లెట్ దిగిందా అని డైలాగులు వేసేవాడు.. పల్నాడులో బుల్లెట్ దిగితే ఈసారి చెన్నై పోతాడన్నారు. ఫ్లెక్సీలను మార్చినంత సులభంగా అభ్యర్థులను వైసిపీ మారుస్తోందని.. ప్రతి విషయంలో మోసం, ధగా చేయడం జగన్‍కు అలవాటని విమర్శించారు.
హు కిల్డ్ బాబాయ్ .. సమాధానం చెప్పేందుకు సిద్ధమా ?
జగన్ మీటింగ్ పెడితే స్కూళ్లకు సెలవులు .. స్కూళ్ల బస్సులు అన్నీ జగన్ సభకు పంపాలి .. మనం డబ్బులు కట్టినా ఆర్టీసీ బస్సులు ఇవ్వరు కానీ జగన్ మీటింగ్‍కు ఫ్రీగా ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారని విమర్శఇంచారు. వైనాట్ కుప్పం అంటున్నాడు జగన్ - వైనాట్ పులివెందుల అని మేం అంటున్నామన్నారు. హు కిల్డ్ బాబాయ్..? అంటున్నారు ప్రజలు, నిన్న ఆయన చెల్లెలు నిలదీసింది సిద్దం.. సిద్దం.. అంటున్న జగన్‍ను నేను ప్రశ్నిస్తున్నా .. బాబాయ్ హత్యకు సమాధానం చెప్పేందుకు జగన్.. సిద్ధమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మొదట గుండెపోటుతో చనిపోయాడని జగన్ చెప్పాడు -తర్వాత గొడ్డలి పోటు అని తేలింది.. అంటే ముందుగానే ఆ కుట్రలో జగన్‍కు భాగస్వామ్యం ఉందని తేలిపోయిందన్నారు. హత్యలు చేసే వ్యక్తి నాయకుడిగా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు బాధ ?
ఈ పాలకులకు పరిపాలించే అర్హత లేదని సునీత అన్నారని .. హంతకులు మన మధ్యనే ఉంటారని సునీత చెప్పారని గుర్తు చేశారు. హత్యకేసు ఏదైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది వివేకా హత్య కేసు అదిఏళ్లు అయినా తేలలేదని ప్రశ్నించారు. సోదరి షర్మిలపైనే సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడుతున్నారు సోదరి పుట్టుకపై సైతం దారుణంగా మాట్లాడుతున్నారు .. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ పోస్ట్ పెడితే వేధించారు చివరికి రంగనాయకమ్మ హోటల్ మూయించివేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు బాధ, రెండు పార్టీలు ఓ సయోధ్యకు వచ్చాం రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన ఒకటి అయ్యాయని స్పష్టం చేశారు. ఎవరికీ, ఎప్పుడూ ఇవ్వని గౌరవం పవన్ కల్యాణ్‍కు ఇస్తున్నాం.. అది మా పార్టీ సంస్కారమన్నారు. ఏపీ భవిష్యత్ కోసం కలిసి పనిచేస్తున్నాం టీడీపీ-జనసేన మధ్య ఒక అవగాహన కుదిరిందని స్పష్టం చేశారు.