Allagadda Chandrababu comments  : నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే వైసీపీ  పతనం ఖాయమనిపిస్తోందని టీడీపీ  అధినేత చంద్రబాబు అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు.   ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో  చంద్రబాబు ప్రసంగించారు. నంద్యాల జిల్లాలోని అన్ని స్థానాలలో టీడీపీ గెలవబోతోందన్నారు.  యువత నిరుద్యోగులుగా మారారు. ఎక్కడ చూసినా విధ్వంసక పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలని ఆకాంక్షించారు. రాతి యుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా? అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. 
 
నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ తేవాలనుకున్నాం కానీ జగన్ ఆపేశారన్నారు.  ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కును అటకెక్కించారు. ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తెచ్చాం. 6 మెగావాట్లతో సోలార్‌ పార్క్‌ తెచ్చేందుకు ప్రయత్నించామని వాటన్నింటినీ నిలుపుదల చేశారని జగన్ పై మండిపడ్డారు.  స్థానిక వనరులు వాడుకుంటే బయటకు వెళ్లి పనిచేసే అవసరం లేదన్నారు.  జగన్‌ వచ్చాక సీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా?ప్రాజెక్టులపై మ ఖర్చు చేసిన దానిలో 20 శాతం కూడా జగన్‌ ఖర్చు చేయలేదు. రాయలసీమ ద్రోహి  జగన్‌ అని మండిపడ్డారు. 
 
అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామని..  భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు.  ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి జగన్‍కు ఓటేశారని.. ఒక్కసారే అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ తప్పదన్నారు.  రాయలసీమకు 350 టీఎంసీల నీరు ఇవ్వాలనేది  తన లక్ష్యమన్నారు.  గోదావరి నీటిని బనకచర్లకు తెస్తామని.. నీళ్లు ఉంటే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారన్నారు.  రాయలసీమ రైతులు పండ్ల తోటలు, కూరగాయలు పండించాలని..   90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది తామేనని గుర్తు చేశారు.   వైసీపీ ప్రభుత్వం వచ్చాక హార్టీకల్చర్ సాగు బాగా తగ్గిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.  మీ భూమి పాస్‍బుక్‍లో జగన్ బొమ్మ ఎందుకు?  మీ భూముల రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 


ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు..మెగా డీఎస్‍సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు.  ఈ ప్రభుత్వ వేధింపులతో అమరాజా, జాకీ కంపెనీలు పారిపోయాయని..   తిరుపతిని ఆటోమొబైల్ హబ్ చేయాలని అనేక కంపెనీలు తెచ్చానని గుర్తు చేశారు.  యువత భవిష్యత్తుకు తనదీ గ్యారంటీ అని యువత టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తేవాలి పిలుపునిచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.  నంద్యాల జిల్లాలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా?  వైసీపీ పరిపాలనలో అన్ని ప్రజలు దెబ్బతిన్నారన్నారు.   ఈ ఐదేళ్లలో మీ జీవతాల్లో ఏదైనా మార్పు వచ్చిందా?  అని ప్రశ్నించారు.  జగన్ మాయ మాటలకు మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.  దళితులకు భూములు కొని ఇచ్చాం - ఎస్సీ వర్గీకణ చేసి అందరికీ న్యాయం చేశామన్నారు. 


జగన్, షర్మిల గోడవ పడి మాపై విమర్శలు చేస్తున్నారని..విమర్శించారు.   జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోందని ప్రశ్నించారు.  తోడబుట్టిన చెల్లికి ఆస్తి ఇవ్వకుండా గొడవలు పెట్టుకుని  తిరిగి మాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.  వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు చేసి అనేక డ్రామాలు ఆడారు  వివేకా కుమార్తె, సీబీఐ అధికారులపైనా కేసులు పెట్టారు  ఆరోపణలు చేసిన రిలయన్స్ కంపెనీ మనిషికే ఎంపీ ఇచ్చారని విమర్శలు గుప్పించారు.