Chandrababu Bail Petition: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు ఈ విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈ కేసును వాయిదా వేసింది. అయితే సర్కారు తరఫు న్యాయవాది దుష్యంత రెడ్డి ఈ కేసును గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ఇదిలా ఉండగా.. వచ్చే మంగళవారం రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఉందని, అదే రోజున ఈ పిటిషన్ పై కూడా విచారణ చేపట్టారని కోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ కోరారు. ఇద్దరు తరఫున న్యాయవాదులతో మాట్లాడిన న్యాయమూర్తి ఈనెల 20వ తేదీకి విచారణను వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. 


ఏ1గా చంద్రబాబు, మరో 159 మంది నేతలపై కేసులు


చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రలో భాగంగా చిత్తూరుజిల్లాలో పర్యటించిప్పుడు  పుంగనూరుకు వెళ్తున్న సమయంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంగళ్లు అనే గ్రామంలో  దాడులు జరిగాయి.  అంగళ్లు గ్రామంలో జరిగిన దాడుల విషయంలో చంద్రబాబు పేరును ఏ వన్‌గా చేర్చారు. మరో 159 మంది పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబుపై ఏకంగా అక్కడ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఈరోజు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్మ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ కు వెళ్లారు. ఆ తర్వాత రోజుల్లో కూడా ఊహించని వీఐపీలు.. ములాఖత్‌క వచ్చి చంద్రబాబును పరామర్శించేలా.. మద్దతు తెలిపేలా సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే వారం రోజులు.. రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టే రాజకీయాలు తిరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడేనా?  


చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారన్న  వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది.   చంద్రబాబు  కుంగిపోవడం అనేది ఉండదని.. రాజకీయ వేధింపులను కూడా రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొంటారని అంటున్నారు.  ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులుజైల్లో ఉంచలేరని ఆయనకు తెలుసని.. అందుకే... వీలైనంత గా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.  చంద్రబాబు రాజకీయం ఊహించని విధంగా ఉంటోందని చెబుతున్నారు.   ఇంకా ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టి.. లోకేష్ .. పవన్ కల్యాణ్ నూ అరెస్టు చేసి...  ఆ తర్వాత ఎన్నికలకు  వెళ్తుందన్న ప్రచారం బయట జరుగుతోంది.  రాజకీయాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సానుభూతి పవనాలు వీస్తే..  ఆయా పార్టీలకు తిరుగు ఉండదు. పైగా చంద్రబాబు గతంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో చేశానని.. చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అడిగితే.. .. ప్రజలు కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయని అంచనా వేస్తున్నారు.


Read Also: Andhra Politics : చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయడం లేదు - రాజకీయం మార్చేందుకు టీడీపీ పక్కా ప్రణాళిక రెడీ చేసుకుందా ?