Chandrababu In Vizag :    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ను విశాఖ ఎయిర్ పోర్టు లో ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు కలిసారు.   స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం   వినతిపత్రం ఇచ్చాjg. ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చంద్రబాబు వారికి వివరించారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం తన   బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయిందన్నారు.  ఈ సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్తానని స్టీల్ ప్లాంట్ కార్మికులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. గత కొన్ని ఏళ్లుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా.. కేంద్రం, జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే చంద్రబాబుని కలిశామని కార్మిక నేతలు చెప్పారు. కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకు వెళతామని చెప్పి వైసీపీ నేతలు మాట తప్పారని, కనీసం అఖిల పక్షం నేతలనైనా సీఎం జగన్ ఢిల్లీకి తీసుకువెళ్ళాలని... ప్రైవేటీకరణను ఆపాలని.. లేదంటే ప్రజలు విశ్వసించరని కమిటీ నేతలు పేర్కొన్నారు.



స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చాలా కాలంగా నిరసన చేపడుతున్నారు. వీరికి మద్దతుగా   ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని చంద్రబాబు గతంలోనే లేఖ పంపేశారు.   స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. వాజ్ పేయి హయాంలో.. ఇలానే స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పట్లో… కేంద్రం ..దాదాపుగా పదమూడు వందల కోట్లు కేటాయించి.. కాపాడిందని.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పనిచేయాలని చంద్రబాబు కోరారు. అయితే రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం లేదు. 


గత ఆదివారం తెలంగాణ మంత్రి కేటీఆర్ తకూడా కేంద్రానికి ఓ లేఖ రాశారు.  కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలంటూ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు  అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందన్న కేటీఆర్ లేఖలో ఆరోపించారు. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమే వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన రూ. 5వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మెల్లగా రాజకీయ దుమార్ం వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా తమ పోరాటాన్ని ఉద్దృతం చేశారు. మరో వైపు ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న రాజకీయ పార్టీలు .. ఇప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని.. కార్మికులకు మద్దతు ఇస్తామని ముందుకు వస్తున్నారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న ప్రచారం ఊపందుకుంది.