Chandra babu Pawan Kalyan Vidhvamsam Book Launch: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన చేశారంటూ, ఆయన పాలనపై రాసిన ‘విధ్వంసం’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు ఇద్దరూ ఒకేవేదికపై కనిపించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రముఖ పత్రికా సంపాదకులు ఆర్వీ రామారావ్ వ్యవహరించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం రాత్రి ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి.. తొలి ప్రతిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అందించారు.
‘విధ్వంసం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జగన్ పాలనలో అందరూ బాధితులే. నేను, పవన్ కళ్యాణ్ పుస్తకం రాసిన సురేష్ కూడా రేపో మాపో బాధితుడు అవుతాడు. దమ్ముగా 5 ఏళ్లలో జరిగిన వాస్తవాలను ఆలపాటి సురేష్ రాశాడు. దేశంలో తొలిసారిగా ఒక ప్రభుత్వ పాలన పుస్తకం రాయడం మొదటిసారి చూస్తున్న. ఎక్కడ అయినా ఉద్యమాల మీద వేరే సంఘటనలపై రాస్తారు. సమాజంలో ఒక జర్నలిస్ట్ వివిధ కొనాలలో చూస్తారు. 5 కోట్ల ప్రజల మనసులో ఏం ఉందొ ఈ పుస్తకంలో సురేష్ రాసాడు.
అమరావతి రైతులు భూములు ఇచ్చేవాళ్లే కాదు
ఒక రోడ్డు, ప్రాజెక్టు కట్టాలి అంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అలాంటిది 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. సైకో వస్తాడు అనుకుంటే నాకు భూమి ఇచ్చే వాళ్ళు కాదు. దేవతలా రాజధాని అమరావతి అందుకే అందరిని అడిగి ఆ పేరు పెట్టాను. దేశంలో అన్ని దేవాలయాలలో పూజలు చేసి జలాలు, మట్టితో శంకుస్థాపన చేసాము. అంత మంది దేవతల రాజధాని అయినా దేవతలు కూడా అనుకోని ఉండరు జగన్ వస్తాడు అని. రెండు లక్షల కోట్ల ఆస్తితో రాజధాని నిర్మాణం జరిగి ఉండేది. మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారు..వైసీపీ నాయకులకి సిగ్గు ఉందా. 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని సరిపోలేదు అని అంటున్నారు. ప్రజావేదిక కూల్చి వస్తువులను కూడా తీయలేదు. రోజు దాన్ని చూసి నేను బాధపడాలి అని సైకో చేస్తున్నాడు’’
వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
‘‘ప్రభుత్వమే ఒక సమస్యగా మారింది. సీఎం మానసిక పరిస్థితి బాలేదు. ప్రతి ఒక్కరు చెడుని నివారణకు నడుం బిగించాలి. కుల, మత, ప్రాంతాలకి అతీతంగా ముందుకు రావాలి. అన్ని సహజ వనరులు మనకు ఉన్నా అభివృద్ధి లేదు..అందరూ బయటికి వెళ్లిపోతున్నారు. విదేశాలలో మన తెలుగు వాళ్ళు బాగా రాణిస్తున్నారు. తెలుగు జాతి దేశంలో ముందు ఉండాలి. ప్రజలు తిరగబడాలి. 54 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. నేను, పవన్ కళ్యాణ్ మా బాధ్యత మేము చేస్తాం’’ అని చంద్రబాబు మాట్లాడారు.
ఆ దెబ్బలు చూసి కన్నీళ్లు వచ్చాయి - పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ పుస్తకంలో ఉన్న చాలా సంఘటనలకి నేను సాక్షిని. వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అన్న మాటకు ఈ పుస్తకం కారణం. ఎన్నికలు అయిన వెంటనే కూల్చివేతలతో వైసీపీ పాలన మొదలు అయింది. అమరావతి ప్రజలు శరీరం మీద దెబ్బలు చూస్తే కన్నీళ్లు వచ్చాయి. ఆడపిల్లల మిస్సింగ్ మీద నా మాటలు వేరుగా అర్ధం చేసుకుంటున్నారు. వాలంటీర్ సేకరించిన డేటా హైదరాబాద్ లో ఒక ప్రవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు అని అడిగా.. వాలంటీర్ అందరూ చేసారని నేను అనలేదు కొంతమంది గురించి అన్నాను. చివరికి 33 వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని జగన్ ఒప్పుకున్నారు. క్లాస్ వార్ గురించి జగన్ మాట్లాడే స్థాయి లేదు. క్లాస్ వార్ మీద కూడా ఒక పుస్తకం సురేష్ గారు రాయాలి’’ అని అన్నారు.