ఎక్కువ కాలంలో ఒకే పార్టీలో ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి,  అలాంటి తెలుగు లీడర్స్‌లో ఒకరు కంభంపాటి హరిబాబు. అందుకే ఆయనుకు ఢిల్లీ పెద్దలు పిలిచి మరీ గవర్నర్ పదవి కట్టబెట్టారు. మిజోరాం గవర్నర్‌గా నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్. 




హరిబాబు స్టైలే వేరు 


ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సూచనలతో ఎదిగిన కంభంపాటి హరిబాబు పొలిటికల్‌ ప్రొఫైల్‌ చాలా డిఫరెంట్‌. తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య, దత్తాత్రేయ తర్వాత సీనియర్ ఎవరంటే కచ్చితంగా వినిపించే పేరు హరిబాబు. అందుకే ఆయన్ను పిలిచి మిజోరం గవర్నర్‌ను చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న బీజేపీ. 


బిగ్గెస్ట్‌ విక్టరీ అది 


రాజకీయాలపై ఉన్న ఇంట్రస్ట్‌తో ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చిన హరిబాబు చాలా పదవుల్లో పని చేశారు. 1999లో మొదటిసారిగా విశాఖపట్నం-1 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అధ్యకుడిగా కూడా 2014లో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఆయన పొలిటికల‌్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మపై 2014లో పోటీ చేసి గెలవడం ఆయన కెరీర్‌లోనే  చాలా స్పెషల్. ఈ విక్టరీ అప్పట్లో దేశవ్యాప్త సంచలనం. వైసీపీ నుంచి పోటీ చేసిన విజయమ్మపై 90,488 ఓట్ల మెజారిటీతో సాధించిన విక్టరీ హరిబాబు పొలిటికల‌్‌ కెరీర్‌లోనే పెద్దది. 


ప్రొఫెసర్‌ టూ గవర్నర్


మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్‌గా వెళ్తున్న కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసి అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. తెన్నేటి విశ్వనాథ్‌, సర్దార్‌ గౌతు లచ్చన్న, వెంకయ్య లాంటి వ్యక్తుల పరిచయంతో నాటి ‘జై ఆంధ్ర’ ఉద్యమంలోనూ పాల్గొన్నారు హరిబాబు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌ స్టూటెండ్‌ ఫెరడేషన్‌కు కార్యదర్శిగా పని చేశారు. ఎమర్జెన్సీ టైంలో 6 నెలలు జైల్లో కూడా ఉన్నారు హరిబాబు. 1993లో ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి డైరెక్ట్‌ పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాల్లో జీవితాన్ని స్టార్ట్ చేసిన కంభంపాటి ఇప్పుడు మిజోరం గవర్నర్‌గా ఎదిగారు. 


కీలక పదవుల్లో తెలుగు లీడర్లు 


హరిబాబు కంటే ముందు బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన్ని హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి హరియాణాకు మార్చారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగు లీడర్లు కీలక పదవిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య, హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.