Andhra Capital:  అమరావతికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది.  పనులు ప్రారంభించడం కోసం 25 శాతం నిధుల్ని అడ్వాన్సుగా ఇవ్వాలని సీఆర్డీఏ కోరింది. సీఆర్డీఏ విజ్ఞప్తి మేరకు కేంద్రం రూ. 4285 కోట్లను విడుదల చేసింది. ఇందులో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాల తొలి విడతతో పాటు కేంద్రం ఇస్తామని చెప్పిన సాయంలో ఇరవై శాతం రూ. 750కోట్లను మంజూరు చేసింది.               

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతికి భారీగా నిధుల కేటాయింపు        

ఏపీలో టీడీపీ ప్రభత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం అమరావతికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. బడ్జెట్ లో పదిహేను వేల కోట్లు కేటాయించింది. అయితే ఇవి నేరుగా కేటాయింపులు కాదు. వివిధ మార్గాల ద్వారా అమరావతికి సమకూర్చే మొత్తం . ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణాలిప్పించింది. ఆ రుణాలకు గ్యారంటీగా కేంద్దరమే ఉంటుంది. తిరిగి చెల్లించేది కూడా కేంద్రమేనని లోక్ సభలో కేంద్ర మంత్రి చెప్పారు. ఏపీ రుణాల ఖాతాలోకి అవి రావని చెబుతున్నారు.           

ఇప్పటికే 40వేల కోట్లకుపైగా పనులకు టెండర్లు ఖరారు              

నిధులు రావడం ఖాయం కావడంతో ఇప్పటికే కీలకమైన పనులకు టెండర్లు పిలిచారు. హైకోర్టు, ఉద్యోగుల  భవనాలు, అధికారుల విల్లాలు, సచివాలయం పాలనా భవనాలు, అసెంబ్లీ ఇలా అన్నింటికీ టెండర్లు పిలిచారు. అమరావతిలో 90 పనులు చేయాలని నిర్ణయించింది. వీటిలో రూ.48,000ల కోట్లతో 73 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో రూ.40,000 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు ఖరారు చేశారు. ఇప్పటికే ఖరారైన టెండర్లకు  న సీఆర్‌డీఏ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. త్వరలో గుత్తేదారు సంస్థలతో సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ ఒప్పందాలు చేసుకోనున్నాయి.ఆయా కాంట్రాక్ట్‌ సంస్థలు పని ప్రదేశాల్లో కూలీల బస, సామగ్రి నిల్వ కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. పనుల ప్రారంభ సమయానికి అంతా సిద్ధం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సచివాలయ భవనాల టెండర్లపై తర్జన భర్జన                    

ప్రధానంగా సచివాలయం భవనం నిర్మాణానికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.  జీఏడీ టవర్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌ కాకుండా 47 అంతస్తులు కాగా, మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లు 39 అంతస్తులుగా డిజైన్‌ చేశారు. డయాగ్రిడ్‌ విధానంలో రూపొందించిన డిజైన్ల ప్రకారం ఈ టవర్ల నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుంది. ఇప్పటికే ఓ సారి మద్రాస్ ఐఐటీ నిపుణులు పనాదుల్ని పరిశీలించారు. ఐదేళ్ల పాటు నీటిలోనే నానడంతో పరీక్షలుచేశారు. మరోసారి మద్రాస్‌ ఐఐటీ నిపుణులు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు ప్రారంభించనున్నారు.