తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా  తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి.  సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు పెట్టారు. 





గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 



మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబుతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఫోటో ద్వారా చెబుతూ ట్వీట్ చేశారు. 





జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 



కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 



తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క కూడా చంద్రబాబుకు రాఖీ కడుతున్న పాత ఫోటోను షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.



పలువురు సినీ ప్రముఖులు కూడా చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.