Btech Student Suspicious Death in NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరం (Mylavaram) మండలంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించగా.. తోటి విద్యార్థినులు వార్డెన్ కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని విలపించారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా.. తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. తమ కుమార్తె మరణానికి కారణాలు చెప్పాలంటూ అడ్డుపడ్డారు. వసతి గృహంలో వార్డెన్ పర్యవేక్షణ ఏదీ అంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు సద్ది చెప్పడంతో శాంతించారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకూ మృతురాలు తన సోదరుడితో సంభాషించినట్లు తోటి విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన విద్యార్థిని మైలవరం కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రమేష్, సీఐ కృష్ణకిశోర్ వెల్లడించారు. 


Also Read: Viral News: అనంతపురంలో దారుణం- పట్టపగలే మహిళపై దాడి- నిందితుడిపై కేసు నమోదు