ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన
అమరావతి: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ ఏపీకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్, గుంటూరు విద్యానగర్ కు చెందిన పోతుగుంట్ల చందన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. గుంటూరుకు చెందిన పోతుగుంట్ల అనిల్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె చందన అక్టోబర్ 20వ తేదిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకున్నారు.
అమరావతిలోని ఎస్ ఆర్ ఎం యూనివర్శిటిలో చందన బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. సిద్ధార్థ త్రిపాఠి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థుల బృందం అక్టోబర్ 11న గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లారు. హిమాలయ ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంప్ ను అధిరోహించి చందన బృందం రికార్డు నెలకొల్పింది. హిమాలయాన్ని అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేట్ కళాశాల విద్యార్థుల బృందం ఇదేనని నిర్వాహకులు వెల్లడించారు. చందన సాధించిన ఘనతపై గుంటూరు స్థానికులతో పాటు ఏపీ చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం