Ap Government Key Decision To Protect Corruption Complainants: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసే వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రను నోడల్ అధికారిగా నియమిస్తూ సీఎస్ నీరబ్‌కుమార్‌ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసే సదరు వ్యక్తులు నోడల్ అధికారిని సంప్రదించాల్సిందిగా సర్కారు పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల్లోని ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసే వారికి రక్షణగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులు వివరాలకు 0866 - 2428400/2974075 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. caoauditapint@gmail.com కు మెయిల్ చేయాలన్నారు.


Also Read: Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్