Botsa Satyanarayana about Anganwadi Strike in AP: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చుతామని మంత్రి బొత్స తెలిపారు. అంగన్వాడీల 13 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ తో చర్చిస్తామని చెప్పారు. మంత్రి బొత్స ప్రకటనతో అంగన్వాడీలు సమ్మె (Anganwadi Strike) విరమించనున్నారు.


అంగన్వాడీ యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో కీలక అంశాలు


1. అంగన్‌వాడీలు – ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన అంగన్‌వాడీలు. 42 రోజుల సమ్మెకు తెరదించిన అంగన్‌వాడీలు.


2. ఉభయుల అంగీకారం మేరకు వచ్చే జులైలో జీతాల పెంపునకు ఒప్పుకోలు.
3. మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన చర్చలు సఫలం. చివరి విడతగా నాలుగో దఫా చర్చలు సఫలం.
4. మొత్తం 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం. 
- ఈ ఏడాది నుంచి అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపు చేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షలు. అద్దె భవనాల్లో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లకు రూ. 66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు. 
- అంగన్వాడి కేంద్రాల్లో పరిశుభ్రతకోసం అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి రూ.7.81 కోట్ల రూపాయల నిధులు మంజూరు. 
- సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21206 అంగన్వాడి సెంటర్స్ కు ఒకొక్క కేంద్రానికి Rs.3000/- రూపాయల చొప్పున రూ.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల. 
- అంగన్వాడీ సహాయకులను అంగన్‌వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరములకు పెంచుతూ G.O.MS:44 తేది 20.12.2023 జారీ.
- ఆంగన్‌వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్‌వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్.2303564/2023/PROG-I-A1,dt.20.12.2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడిన తేది నుండి ఇది అమల్లోకి.


- అంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్‌ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయం. 
- రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లుకు రూ.1 లక్ష మరియు హెల్పర్‌లకు  రూ.40000 వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని G.O.MS.No:47 తేది 20.12.2023 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. మొదలైన 10 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది.