BJP vice president Vishnuvardhan Reddy :   వైసీపీ హయాలలో బుడమేరు వంటి ఏర్లు, చెరవులు పెద్ద ఎత్తున కబ్జాకు గురవడం వల్లనే వరదలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరదల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. 


చెరువుల కబ్జాల వల్లనే వరదలు


ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితులను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నరాని.. సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏపీలో కూడా ఉండటం లేదని.. ఇతర రాష్ట్రాల్లో ఉండి.. ఎన్డీఏ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.ఇలా మాట్లాడటం సరి కాదన్నారు.  రాష్ట్రంలో వరదల వలన నష్టపోయిన జిల్లాలకు బిజెపి అండగా ఉంటుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వరదల గురించిన సమాచారం తెలియగానే..  12 వేల మందిని ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని గుర్తు చేశారు.  వై.సి.పి ప్రభుత్వంలో అనేక చెరువుల కబ్జాల వలనే ఈ విపత్తులకు కారణమని.. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.    


తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్, హైడ్రాపై పవన్ కల్యాణ్ ప్రశంసలు


కేంద్ర విపత్తు సాయం


వరదల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునే విషయంలో సమర్థంగా వ్యవహరించిందని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా సాయం చేయడం లేదన్నారు. పెద్ద ఎత్తున వరద బాధితులకు సాయం చేస్తున్న వారిని విష్ణువర్దన్ రెడ్డి అభినందిస్తున్నారు. 


 




బీజేపీ సభ్యత్వ నమోదు 


బీజేపీలో  2014లో దేశవ్యాప్తంగా 11కోట్ల మంది సభ్యులుగా చేరారు. అయితే  కరోనా కారణంగా ఐదేళ్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టలేదు.  ప్రస్తుతం 18కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబున్నాయి. ఏపీలోనూ భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీలో కోటి మందికి సభ్యత్వం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.                                                          


వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం