వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సోము వీర్రాజు ఈ రోజు పర్యటించారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల విష‌యంలో ప్రభుత్వ జోక్యం ఎందుకని ప్రశ్నించారు. అందులో జోక్యం చేసుకోవ‌డం స‌రికాద‌ని  సోము వీర్రాజు చెప్పారు.  


కేంద్రం నిధులిస్తే జ‌గ‌న్ సొంత ప‌థ‌కాలుగా ప్రచారం చేసుకుంటున్నార‌ని సోము వీర్రాజు విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని ఆదాయ వ‌న‌రుగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోంద‌ని చెప్పారు. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ త‌ర‌ఫున మండ‌ల స్థాయి భేటీలు నిర్వహిస్తామన్నారు. అన్ని విష‌యాల‌ను వివ‌రించి చెబుతామ‌ని సోము వీర్రాజు అన్నారు.


ఏపీ సర్కారు ఇటీవల ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను ఈ మధ్యనే ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం... అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.


మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20


మున్సిపాలిటీ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15


నగర పంచాయతీల్లో...



 



  1. మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10


గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్స్-  ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5


Also Read: Cm Jagan Delhi Tour: రేపు సీఎం జగన్ దిల్లీ పర్యటన... ప్రధాని మోదీతో భేటీ


Also Read: RGV On Tickets Issue: ఏపీ టికెట్ల వివాదంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు... ఒకరిద్దరు హీరోలను తొక్కేయడానికో ఏమో...!... ధరలు తగ్గింపుపై లాజిక్ ఏమిటని ప్రశ్న