BJP Laxman :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.  వైఎస్ఆర్‌సీపీ.. తాము బీజేపీకి మద్దతిస్తామని ప్రకటిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారు. కానీ పొలిటికల్ పిక్చర్ మాత్రం క్లియర్ కావడం లేదు. ఈ క్రమంలో  తెలుగు రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను ఢిల్లీలో చక్కదిద్దే..  బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు  చేశారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విధానంలో మార్పు లేదన్నారు. దీంతో .. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చని జరుగుతున్న ప్రచారం విషయంలో బీజేపీ అంతా సీరియస్ గా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో భేటీ తర్వాత పొత్తులపై రకరకాల చర్చలు                                         


ఇటీవల టీడీపీ అనేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేసం అయ్యారు. ఆ తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన   కేంద్రమంత్రి నరేంద్రమోదీ ,  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభుత్వం అవినీతి మయం అయిందని ఆరోపించారు.  విశాఖలో శాంతి భద్రతలు లేవన్నారు.   బీజేపీ అగ్రనేతలు ఇలా విమర్శలు చేయగానే ఇక  బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమని.. అందుకే ఆ పార్టీ నేతలు వైసీపీ పాలనను విమర్శిస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం ప్రారంభమయింది. అయితే..  టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఆరోపణలు చేశారు సరే.. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ... ప్రశ్నించడం ప్రారంభించారు.  అటు వైసీపీ నేతలు .. తాము  బీజేపీకి దేశం కోసం మద్దతిస్తామని చెబుతున్నారు.  


బీజేపీతో కలిసి పోటీ చేసే విషయంలో స్పష్టతనివ్వ ని జనసేన                              


మరో వైపు జనసేన పార్టీ బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. టీడీపీతో పొత్తులు ఖాయమని జనసేనాని ప్రకటించారు. ఈ మేరకు.. కలిసి రావాలని బీజేపీని కోరుతున్నారు. ఏపీలో ఉన్న  రాజకీయ పరిస్థితుల్లో  బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీతోనూ కలవకుండా ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటే.. టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీ పార్లమెంట్ సీట్లు గెలిచినా  బీజేపీకే మద్దతిస్తారు. ఒక వేళ ఏదైనా పార్టీతో కలిస్తే మాత్రం మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది. ఆ పార్టీ విపక్షాల కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే..  బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. 


త్వరలో పొత్తులపై క్లారిటీ వచ్చే  అవకాశం         


ప్రస్తుతం  జనసేనతో పాటు  బీజేపీని  కూడా కూటమిలో చేర్చుకోవాలంటే.. ఏపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న షరతును..  పెట్టినట్లుగా..  అచ్చెన్నాయుడు, చంద్రబాబునాయుడు ప్రకటనలను బట్టి అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ తీసుకునే తదుపరి చర్యలను బట్టి..ఏపీలో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.