Nuthan Naidu In Congress : బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో కామన్ మెన్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టి కావాల్సినంత హంగమా చేసిన నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల నూతన్ నాయుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. విశాఖకు చెందిన నూతన్ నాయుడు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఎలా సాధించారన్నదానిపై అనేక రకాల రూమర్స్ ఉన్నాయి. బిగ్ బాస్ రెండో సీజన్ తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు హడావుడి చేశారు. అయనకు వివిధ వ్యాపారాలు ఉన్నాయని.. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థను కూడా నడుపుతున్నారని చెబుతారు. 


లగడపాటి కోసం సర్వేలు చేసిన నూతన్ నాయుడు                   


2019 ఎన్నికల సమయంలో  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన సంస్థలో సర్వే బాధ్యతలను ఆయనే నిర్వహించారని రాజకీయవర్గాలు చెబుతాయి. అయితే ఆయన సర్వే ఫలితాలు పూర్తి స్థాయిలో తేడా కొట్టడంతో లగడపాటి ఇక తాను సర్వేలు ప్రకటించబోనని చెప్పారు. ఓ సారి తన ఇంట్లో దిళిత వర్గాలకు చెందిన పని మనుషుల్ని హింసించినట్లుగా కూడా నూతన్ నాయుడు కుటుంబం ఆరోపణలు, కేసులు ఎదుర్కొంది. ఆ తర్వాత చాలా కాలం సైలెంట్  అయ్యారు. 


ప్రతి ఒక్క వినతికి పరిష్కారం - టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు భరోసా


పీఆర్పీ, జనసేనలకూ పని చేసిన నూతన్ నాయుడు                       


నూతన్ నాయుడు ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరుఫున పనిచేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో ఆయన ఆ పార్టీ తరపున పని చేశారు.. కానీ అధికారికంగా ఆ పార్టీలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించలేదు. మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలుున్నాయన్న ప్రచారం జరిగింది కానీ.. తర్వాత కూడా ఎప్పుడూ జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?


కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు షర్మిల ప్రయత్నం                      


ఏపీలో బలోపేతం కావడానికి కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కాస్త గుర్తింపు ఉన్న నేతలు ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నూతన్ నాయుడు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం, ఆయనకు పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ ఉండటంతో వివిద రకాలుగా పార్టీకి ప్రయోజనం కరం అన్న ఉద్దేశంతో పార్టీలో చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. నూతన్ నాయుడుకు రాజకీయ జీవితంపై ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకూ సరైన అవకాసాలు రాలేదు. కాంగ్రెస్ లో అయినా తనకు పోటీ చేసే అవకాశాలు దొరుకుతాయని ఆయన నమ్మకంతో ఉన్నారు.