Punganoor Tension: అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్రకు వస్తున్న సందర్భంగా అడ్డుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్లోఉద్రిక్తత ఏర్పడింది. అంగళ్లు గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. రణరంగంలా మారిన అంగళ్లు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తల దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.
పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే తెచ్చారని వైసీపీ నేతల విమర్శలు
పుంగనూరులో రెండు నీటి ప్రాజక్టులపై కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని.. అభివృద్ధి చేస్తే ఏమాత్రం సహించలేక ఇలాంటి పనులు చేశారని అందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై పెద్ద ఎత్తున గుమికూడారారు. పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడామికి కారణమైన చంద్రబాబును ఎట్టి పరిస్థితులలో ఇక్కడ అడుగుపెట్టినివ్వమని హెచ్చరించారు. పెద్దిరెడ్డి అరాచకాలకు, అవినీతి ప్రతీక ఆ ప్రాజెక్టులు అందుకే అడ్డుకుని రైతులకు న్యాయం చేశామని.. రైతులకు పరిహారం ఇవ్వకుండా.. పెద్దిరెడ్డి దోచుకున్నారని మండిపడుతున్నారు.
ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్
ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీనేతలు రోడ్డుపైకి పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నరాని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంకు భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బంబులతోనే పోరాడిన వ్యక్తి నేను.. రాళ్ళు వేస్తే భయపడతానా..అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు. తాను కూడా నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా.. చిత్తూరు జిల్లాలోనే రాజకీయం చేశానన్నారు. జగన్ లాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
పుంగనూరులో ప్రతిపక్ష నేతలపై తరచూ దాడులు
పుంగనూరులో ఎ ప్రతిపక్ష పార్టీ నేత పర్యటించేందుకు ప్రయత్నించినా ఇదే పరిస్థితి ఉంటుంది. చివరికి ఇటీవలే కొత్త పార్టీ పెట్టుకున్న రామచంద్ర యాదవ్ అనే నేత తన అనుచరులతో ర్యాలీ నిర్వహించినా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. నష్టం చేశారు. ఇలాంటి దాడులు ప్రతిపక్ష నేతలపై పుంగనూరులో తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ సారి చంద్రబాబు పర్యటననే అడ్డుకునేందుకు ఉద్రిక్తతలు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున భద్రత చేపడుతున్నామని పోలీసులు ప్రకటిస్తారు కానీ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.