Avinash Reddy bail cancellation petition hearing in Telangana High Court : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దస్తగిరి వాదనను సమర్థిస్తున్నామని సీబీఐ కోర్టులో వాదించింది ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి( తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.
దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ కూడా వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. ఆ విషయం మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సీబీఐని సూటిగా ప్రశ్నించింది. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని సీబీఐ తరపు లాయర్ పేర్కొన్నారు. సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.
విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు ప్రాణాహనీ ఉందని దస్తగిరి భార్య, దస్తగిరి ఇద్దరూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై ఇంకా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన హైకోర్టు.. విట్‌నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుంటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
అవినాష్ రెడ్డి తరపున వాదనలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వినిపించారు. దస్తగిరి ఇతరుల ప్రోత్సాహంతోనే పిటిషన్ దాఖలు చేశారన్నారు. దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ లో ఏ విధమైన ఆధారాలు చూపించలేదని .. వైయస్ అవినాష్ రెడ్డి ఏ విధంగాను సాక్షులను ప్రభావితం చేయడం లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలతో పిటిషన్ వేశారని వాదించారు. అయితే సాక్షుల్ని ఈ విధంగా బెదిరిస్తుంటే ఏ విధంగా నిందారోపణ అంటారు అంటూ అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించారు. కోర్టు సమయం ముగియటంతో ఏప్రిల్ 15వ తారీఖున తుది వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైనా రద్దు మాత్రం కాలేదు. లో సునీతారెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారు. దీంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆమె అభిప్రాయం కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా విచారణ జరిపి తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
వివేకా హత్య కేసులో అరెస్టయిన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఇటీవలే బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. శివ శంకర్ రెడ్డి రెండు లక్షలు, రెండు షూరిటీ లు సమర్పించాలనే షరతులు పెట్టడం తో పాటు హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి వీల్లేదన్న శ్రుతులు విధించింది.అలాగే పాస్ పోర్ట్ సరెండర్ చేయ్యాలని ఆదేశాలిచ్చింది.ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. శివశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.