Avinash Reddy accused YS Sunitha of telling untruths :  వైఎస్ వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆరోపించారు . ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు  చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సునీత పెడుతున్న ప్రెస్‌మీట్‌లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్‌మీట్‌లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. 


తనకు అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాననని అవినాష్ రెడ్డి తెలిపారు. దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించాలన్నారు.  పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు ..306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్‌ అయిపోయే వరకు బయటకు పంపకూడదన్నారు.  కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారని.. అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయన్నారు. ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. 
 
ఎవరో ఫోన్ చేస్తే అవినాష్‌ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందని.. ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతారని ప్రశ్నించారు.  శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాననన్నారు.  తాను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడని.. నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానన్నారు. వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే  చెప్పి ఉండాలన్నారు.  వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారని.. చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలని సునీతను డిమాండ్ చేశారు. బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారని.. రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారని ఆరోపించారు. 


ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదని..గూగుల్‌ టేక్‌ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందన్నారు.  గూగుల్ టేక్‌ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చిందని.. గ్రీన్‌ విచ్‌ మీన్‌ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చిందని ప్రశ్నించారు.   చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదని స్పష్టం చేశారు.  ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందన్నారు.  నా నెంబర్‌ వాట్సాప్‌లో  ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఎవరు పోస్ట్‌ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందన్నారు. నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా అని ప్రశ్నించారు.