Sarpanchs agitation in AP : పంచాయతీల నిధులను ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపిస్తూ.. ఏపీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీని ముట్టడిస్తామని సర్పంచ్‌లు ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసుల వలయాలను దాటుకుని అసెంబ్లీకి చేరుకున్న సర్పంచ్ లు ఆందోళనచేసారు. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించారంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సర్పంచ్‌ల ఆందోలనతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
కొంత మంది సర్పంచుల్ని అసెంబ్లీకి వెళ్లే మార్గంలో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో సర్పంచ్‌లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సర్పంచులను లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు సర్పంచులకు తీవ్రగాయాలు అయినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ ఇంటి ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనగా ఉయ్యూరులో టైర్లు తగలబెట్టిన వైవీబీ అనుచరులు నిరసన తెలిపారు.
ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించుకోవడంపై తీవ్ర ఆగ్రహం
ఆర్థిక సంఘం గ్రామాలకు ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించుకోవడంపై సర్పంచులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.691 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు సర్పంచ్‌ల ఆధీనంలో గ్రామ సచివాలయాల కార్యకలాపాలు జరగాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.3000 నుంచి రూ.15 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మైనర్ పంచాయతీల కరెంట్ బిల్లులు తాగునీటి సరఫరా వీధిలైట్లు పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనిన్..రు. గ్రామ సచివాలయాలపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లోనే వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన తండాలకు ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం... గ్రామపంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.
చాలా కాలం నుంచి ఆందోలనలు చేస్తున్న ఏపీ సర్పంచ్‌లు
పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. వైసీపీ ప్రభుత్వ సర్పంచ్‌లు కూడా.. తమ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిధులన్నీ మళ్లించుకోవడం వల్ల చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని అంటున్నారు. పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలాయలు పెట్టడంతో సర్పంచ్‌ల పదవిని తగ్గించేసినట్లయింది. ఇది కూడా సర్పంచ్‌ల ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది.