Assembly food contractor was changed on the orders of Speaker Ayanna: ఏపీ అసెంబ్లీలోని ఫుడ్ కాంట్రాక్టర్ స్పీకర్‌నే మాయ చేయబోయారు. అసెంబ్లీలో మొదటి రోజు స్పీకర్‌కు ఓ రకమైన భోజనం సరఫరా చేశారు. ఎమ్మెల్యేలకు మరో రకమైన భోజనం సరఫరా చేశారు. స్పీకర్ లంచ్ టైంలో భోజనం చేస్తే బాగానే ఉందనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు వచ్చి భోజనం బాగా లేదని ఫిర్యాదు చేశారు. దాంతో పుడ్ కాంట్రాక్టర్ ను పిలిపిచంి అయ్యన్న పాత్రుడు విచారణ జరిపారు. మొదట అందరికీ ఒకే ఫుడ్ పెట్టామని బుకాయిచిన ఆయన తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చిన అన్నంలో మాత్రం మార్పు ఉందని కూరలన్నీ ఒకటేనని చెప్పుకొచ్చారు. దీంతో అయ్యన్న పాత్రుడు తీవ్ర ాగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే ఫుడ్ సరఫరా చేసే పాత కాంట్రాక్టర్ ను మార్చేశారు. మంగళవారం నుంచే కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యత అప్పగించారు. అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యేలకు శిక్షణ అనంతరం మధ్యాహ్నం కొత్త కాంట్రాక్టర్ భోజనం ఏర్పాటు చేశారు.
Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
అసెంబ్లీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో స్పీకర్ కే అధికారం ఉంటుంది. అందుకే స్పీకర్ వరకూ మంచి ఫుడ్ తీసుకు వచ్చి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు మాత్రం క్వాలిటీ తగ్గించి సరఫరా చేశారు. ఈ విషయం స్పీకర్‌కు తెలియడంతో కాంట్రాక్ట్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. నిజానిక ిఈ ఫుడ్ కాంట్రాక్టర్ పై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ నేతలకు సన్నిహితులైన వారి మధ్య ఈ ఫుడ్ కాంట్రాక్ట్ కోసం పంచాయతీ కూడా నడిచిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజే కాంట్రాక్టర్ ను మార్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.
అసెంబ్లీలో గతంలో జరిగిన అనే వ్యవహారాలపై తాజాగా చర్యలు తీసుకునే దిశగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలన జరుపుతున్నారు. అసెంబ్లీలో మైక్‌లు నిర్వహించే సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో గత స్పీకర్ తమ్మినేని సీతారాం అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో ఏ వన్ గా నిలిచిన వారికి కాకుండా ఎక్కువ రేటు తో టెండర్ వేసిన.. ఏ మాత్రం అనుభవం లేని సంస్థకు మైకుల నిర్వహణ కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థకు ఎందుకు ఎక్కువకు కాంట్రాక్ట్ ఇచ్చారో కానీ.. స్వయంగా స్పీకర్ ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మామూలుగా ఆ సంస్థ సీసీ కెమెరాలను నిర్వహిస్తుందని వైసీపీ అధినేత జగన్ కు చెందిన వ్యాపార కార్యాలయాల్లో సీసీ కెమెరాలు చూస్తుందని చెబుతున్నారు.
Also Read: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఇదే కాక మరికొన్ని అంశాల్లోనూ అవకతవకలు జరిగాయని వాటన్నింటిపై విచారణ చేయించాలన్న ఆలోచనలో కొత్త స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు కాంట్రాక్టులతో పాటు నిధుల దుర్వినియోగం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద నిఘా పెట్టడం వంటి అంశాలపై విచారణలు చేయించే అవకాశం ఉంది.