TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడుకు గోదావరి తీరం ముస్తాబయింది. రాజమహేంద్రవరంలో నిర్వ హించనున్న మహానాడుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ సమావేశా లు, సభలకు అవసరమైన ప్రాంగణాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.తొలిరోజు 27న ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరు కానున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మహానాడు లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచనున్న అనేక కీలక అంశాలతో పాటు ప్రాథమిక అంశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు.
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నిర్వహించే మహానాడు ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ శత జ యంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మహానాడులో మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలను వెల్లడిం చనున్నట్లు- సమాచారం.
వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం వివిధ రంగాల్లో నష్టపోయిన పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు.
కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్య క్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు నుంచి క్లస్టర్ ఇన్ చార్జ్ ల వరకు దాదాపు 15వేల మంది ప్రతినిధులతో తొలిరోజు సభ నిర్వహి స్తామని, అయితే దీనికి లక్ష మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుందని మహానాడులో ప్రవేశపెట్టనున్న తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలుపనుందని వెల్లడించారు. మొత్తం 15 తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు పార్టీ అధిష్టానం మహానాడు వేదికగా చేయనుం ద ని తెలిపారు. ముఖ్యంగా వైకాపా పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి దశ, దిశ నిర్దేశించే విధంగా పలు తీర్మా నాలను మహానాడులో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరయ్యేందుకు తెలుగు తమ్ముళ్లకు ఆహ్వానాలు అందాయి.ఈ నెల 27న ప్రతి నిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిజిటల్ సంతకంతో పార్టీ యంత్రాంగం ఆహ్వానాలు పంపుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సంద ర్భంగా కొనియాడారు.ఈ ఆహ్వాన పత్రిక లో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు.