Arava Sridhar has been finalized as the Railway Koduru Janasena candidate  :  రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును  పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఇంతకు ముందు అక్కడ అభ్యర్థిగా యనమల భాస్కర్ రావు అనే నేతను ఖరారు చేశారు.  ఆయన వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచురుడుగా తేలింది. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజక వర్గ జనసేన, తెలుగుదేశం కలసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా  అరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది. 


ఈ కారణంగా ఆయన అభ్యర్థిత్వంపై కూటమిలోని పార్టీల నేతల మధ్య చర్చ జరిగింది. ఆయన ఏ మాత్రం బ లమైన వ్యక్తి కాదని వైసీపీ విజయం కోసం పని చేస్తారన్న అభిప్రాయానికి రావడంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. పార్టీ నేతలు.. కూటమిలోని ఇతర పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకుని అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు.  అరవ శ్రీధర్ మూడు రోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు.  రైల్వే కోడూరు నియోజక వర్గం ముక్కావారిపల్లె గ్రామ స్పంచ్‌గా ఉన్నారు. ఆయన టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి స్వగ్రామానికి చెందిన వారు. ఆయన సిఫారసుతోనే టిక్కెట్ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ఉదయమే  అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును  పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అవనిగడ్డ నుంచి ఆయనే బలమైన అభ్యర్థిగా నిర్ణయించి పేరును ఖరారు చేశారు. మండలి బుద్దప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  అంతకు ముందు పలుమార్లు ఆయన ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉన్న నేత కావడంతో పవన్ కల్యాణ్ ఆయన వైపే మొగ్గు చూపారు. జనసేన పార్టీ టిక్కెట్ ఆశించిన బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ వంటి వాళ్లు నిరాశకు గురయ్యారు. 


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌   పవన్‌ ఆరోగ్యం సరిగా లేనందున విశ్రాంతి తీసుకుంటున్నారు.  రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో బుధవారం తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్‌ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి.  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని జనసేనాని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు.