ఉద్యోగులకు  ఎప్పుడూ చేయనంత మేలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుండగా.. చరిత్రలో ఎన్నడూ ఇలా పీఆర్సీతో జీతాలు తగ్గలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదని వారు ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదన్నారు రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి అన్నారు. నేడు ఏపీలో జరుగుతున్న ఛలో విజయవాడ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెతు వెళ్తామని చెప్పారు, అయితే తమ పీఆర్సీ, ఇతర శాఖల ఉద్యోగుల పీఆర్సీకి సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్టీసీ సమస్యలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.


తమ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. రెండేళ్ల క్రితం వరకు ఆర్టీసీకి  6 వేల కోట్ల పైగా అప్పులుండేవని గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకున్న అప్పుల్లో  1495 కోట్లు చెల్లించామని మల్లికార్జున రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్టీసీకి ఇంకా 4800 కోట్లుపైగా  అప్పులున్నాయని.. రెండేళ్లలో ఆర్టీసీకి ఉన్న అప్పులన్నింటినీ తీర్చాలని సీఎం సూచించారని చెప్పారు. తమకు కష్ట కాలంలో అండగా ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం మద్దతుగా నిలవాలని సూచించారు. కానీ కరోనా వల్ల ఆశించిన స్థాయిలో అప్పులు తీర్చలేకపోయాం అని చెప్పారు.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల వచ్చిన సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది, కనుక ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లవద్దని, సమ్మెపై ఉద్యోగులు పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగిందని.. కనుక ఆర్టీసీని ఉద్యోగులే  రక్షించుకోవాలన్నారు. వేతనాల కోసం నెలకు 250 కోట్లు చొప్పున 25 నెలల్లో 6250 కోట్లు సీఎం జగన్ ఇచ్చారు. కనుక ఉద్యోగులు కష్టపడి పనిచేసి సంస్థను నిలబెట్టుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా బస్సులు తిప్పడంపై ఎండీతో చర్చించి  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


Also Read: TDP Support Employees : ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు .. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ !


Also Read: AP Employees : ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?