APBJP : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని ఏపీబీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేశారనివారు మండిపడ్డారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రచారం చేస్తున్నారని.. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భవితష్యత్ ఏమిటని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రశ్నించారు. ప్రతీ ఎమ్మెల్యే కి యాబై కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పుకుంటున్నారని.. నాలుగు సంవత్సరాలు కాలం లో యాబై వేల కోట్ల రూపాయలు దోచేశారని మండిపడ్డారు. రూ. 15/- బాటిల్ 160/- అమ్ము తుంటే ఆ డబ్బంతా జగన్ మోహన్ రెడ్డికి పోతోందని విష్ణుకుమార్ రాజుఆరోపించారు. ఇది ప్రజా ధనం దోపిడీ చేయడమేనని... దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
2024లో జగన్ మోహన్ రెడ్డి బండారం బయట పడుతుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు కే జగన్ పై నమ్మకం లేదని.. నియంతృత్వ ధోరణి తో బెదిరించి అనిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గం లో కూడా డబ్బు రెడీ గా ఉందని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ లు ఒకే రోజు జరిగేలా చూడాలని లేకపోతే దొంగ ఓట్లు పడతాయన్నారు. సీఎం తాత ముత్తాత లు నుండి తెచ్చిన డబ్బు లు పెంచడం లేదు... రాష్ట్ర ఖజానా డబ్బు లు మాత్రమే పంచుతున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. జగన్ అహంకారం చూపించడాన్ని మానుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ప్రజలు గద్దె దించుతారని హెచ్చరించారు.
అతి పెద్ద రాష్ట్రాలు తో సమానంగా తెలుగు రాష్ట్రాలు కు నిధులు కేటాయింపు జరుగుతున్నాయని జీవీఎల్ ప్రకటించారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ విశేష ప్రజాదరణ పొందుతోందన్నారు. అప్పు లు తెచ్చి సంక్షేమం అందిస్తు జగనన్నే మా భవిష్యత్ అనడం దారుణమన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లో ప్రతి పక్షాలు చేసిన అవినీతి బయట పడకుండా పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డు పడడంతో తీవ్ర అంతరాయం ఏర్పడిందని.. అవినీతి వ్యక్తి లను కాపాడటం లో ప్రతి పక్ష ఎంపీ లు కీలక పాత్ర పోషిస్తున్నారని జీవీఎల్ అసహనం వ్యక్తం చేసారు. ప్రతి పక్షాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
వారణాసి గంగానది పుష్కరాలు ఏప్రిల్ 22నుండి మే 3 వరకు జరుగనున్నాయని.. తెలుగు రాష్ట్రాలు ప్రజలే ఎక్కువ గా ఈ ఉత్సవాన్ని చేసుకుంటారన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చిన మేరకు వారణాసి వెళ్లి అధికారులు తో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజూ లక్ష మంది వెళ్లే అవకాశం... కాశీ లో గతం లో మనో వేధన వుండేది సరైన వసతులు లేక ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం బీజేపీ హయాంలో చేపట్టామని.. తెలుగు వారిని ఓలంటీర్లు గా ఏర్పాటు చసి. అన్ని స్నానము ఘాట్లు వద్ద మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. 2011లో ఎలాంటీ ఏర్పాట్లు జరగలేదన్నారు. వారణాసి నాకు నోడల్ జిల్లా... నేను యూపీ నుండి ఎంపీ గా వున్నాహెల్ప్ డెస్క్, హెల్త్ డెస్క్, పోలీసు వ్యవస్థ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.