AP Rains: ఏపీలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారింది. మన్నార్ గల్ఫ్, నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల తోడవ్వడంతో రాబోయే సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.  ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.  

Continues below advertisement

 గురువారం (15-10-2026) వర్ష సూచన 

గురువారం రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.   

మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలు 

మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.  

Continues below advertisement

మిగతా జిల్లాల్లో 

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.     Also Read: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే- అమల్లోకి ఎలక్షన్ కోడ్

నమోదైన వర్షపాతం 

బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన ప్రధాన వర్షపాత వివరాలను ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. 

  1. తిరుపతి జిల్లా: కలుగుర్తిపాడులో 39.9 మి.మీ, చిట్టమూరులో 39.4 మి.మీ, కొత్తగుంటలో 33.6 మి.మీ వర్షపాతం నమోదైంది. 
  2. విశాఖపట్నం జిల్లా: పద్మనాభంలో 35.2 మి.మీ.   
  3. విజయనగరం జిల్లా: డెంకాడలో 29.7 మి.మీ.   
  4. నెల్లూరు జిల్లా: అల్లంపాడులో 28 మి.మీ, చింతవరం, గూడూరులలో 26 మి.మీ చొప్పున వర్షపాతం పడింది. 
  5. అనకాపల్లి జిల్లా: సబ్బవరంలో 27.5 మి.మీ నమోదు అయింది. 

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులతో పాటు తీరప్రాంత ప్రజలు, ప్రయాణికులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  Also Read: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన