Dharmana Prasadarao On Three Capitals : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో మూడు రాజధానుల అంశం(Three Capitals Issue)పై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు(Dharmana Prasadarao) న్యాయవ్యవస్థను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పులు బాధ కల్గించాయన్నారు. ఒకరి విధి నిర్వహణలో మరొకరి జోక్యం సరికాదన్నారు. ఏ వ్యవస్థ రాజ్యాంగ బాధ్యతలు నెరవేర్చకుండా మరో వ్యవస్థకు అడ్డుపడకూడదన్నారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలన్నారు. రాజ్యాంగం తీసుకురావడం వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు పాలన చేయాలని రాజ్యాంగమే చెప్పిందన్నారు. రాజ్యాంగానికి(Constitution) ఎవరూ అతీతుల కారన్న ధర్మాన కార్యనిర్వాహక వ్యవస్థలో కోర్టులు జోక్యం సరికాదన్నారు. ఏపీ అసెంబ్లీకి పరిమితులను పెడుతూ హైకోర్టు తీర్పులు ఇచ్చిందన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయకుడదంటూ హైకోర్టు తెలిపిందన్నారు. హైకోర్టు తీర్పు(High Court Verdict) తర్వాత స్పీకర్ కు లేఖ రాశానన్న ధర్మాన, న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చించానన్నారు. కోర్టులంటే అందరికి గౌరవం ఉందన్నారు. కోర్టు తీర్పులపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాని ధర్మాన ప్రసాదరావు అన్నారు.


Also Read : Atchannaidu: జేబులోకి 10 వేల కోట్ల కోసమే లిక్కర్ పాలసీ మార్పు, జగన్ కుట్ర ఇదీ: అచ్చెన్నాయుడు


న్యాయవ్యవస్థకు స్వీయ నియంత్రణ ఉండాలి


జ్యుడీషియల్‌ యాక్టివిజం(Judicial Acitivism) పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందన్నారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే ఆ విషయం ప్రజలు చూసుకుంటారని, అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధిపై కోర్టులో చెప్పాలన్నారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని ధర్మాన అన్నారు. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు ఉంటాయన్న ఆయన... న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులపైనే ఉందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అధికారాల విషయంలో కోర్టులు పరిధిని సుప్రీం తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. రాజ్యంగంలోని వ్యవస్థల పరిధి, విధులపై స్పష్టత రావాలన్నారు. ఈ స్పష్టత లేకే వ్యవస్థలలో గందరగోళం నెలకొందన్నారు. 


Also Read : AP Assembly Pardhasaradhi: మూడు రాజధానులు కులాల సమస్య కాదు - ప్రాంతాల మధ్య సమతుల్యత : పార్థసారధి