AP Corona Cases: వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల.. కరోనా కేసుల వివరాలివే..

ఈ రోజు ప్రధాన వార్తలు

ABP Desam Last Updated: 13 Aug 2021 07:13 PM
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ

ట్విట్టర్‌ ఇండియా హెడ్‌ మనీష్‌ మహేశ్వరి బదిలీ చేస్తూ ట్విటర్‌ నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌ ఇండియా ఎండీగా ఉన్న మనీష్‌ మహేశ్వరి అమెరికాకు బదిలీ అయ్యారు. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనున్నట్లు సమాచారం. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్‌ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్‌. గ్రీవెన్స్‌ అధికారిగా భారతీయుడినే.. నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు కాస్త ఆలోచించింది. భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్‌ అధికారిగా నియమించింది.

AP Corona Cases: వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల.. కరోనా కేసుల వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,746 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు నమోదయ్యాయి. మహమ్మరి నుంచి మరో 1,648 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో  18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున చనిపోయారు. చిత్తూరులో 203, గుంటూరు-160, తుర్పు గోదావరి-304, విశాఖ-115, విజయనగరం-20, శ్రీకాకుళం జిల్లాలో 91 కేసులు నమోదయ్యాయి.

Delhi : పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీకి ఉగ్రదాడి ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన ఉన్నతాధికారులు

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో టెర్రర్ అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. ఎర్రకోటలో  పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్ర దాడి హెచ్చరికకు సంబంధించి భద్రతా సంస్థలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే మరోవైపు ఢిల్లీలో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Viveka Murder Case: మా ఇంటి చుట్టూ కొంతమంది తిరుగుతున్నారు.. ప్రాణ భయం ఉంది.. వివేకా కుమార్తె

కడప జిల్లా ఎస్పీకి వివేకా కుమార్తె సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని పేర్కొన్నారు. చుట్టూ తిరుగుతూ.. ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారని ఎస్పీకి తెలిపారు. ఆగష్టు 10న పదినిమిషాలకు ఓ అనుమానితుడు ఇంటి చుట్టూ తిరిగారన్నారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ప్రధాన అనుమానితడని తెలిపారు. మణికంఠ రెడ్డి అనే వ్యక్తి మా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నాడని గతంలోనే ఫిర్యాదు చేశానని లేఖలో రాశారు.

హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఇంట విషాదం

హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు గుల్షాన్ ఖట్టర్ శుక్రవారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి న్యుమోనియా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గుల్షాన్ గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ముంబాయిలో డెల్టా ఫ్లస్ వేరియంట్ తొలి మరణం

ముంబాయిలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. ముంబాయికి చెందిన 63 ఏళ్ల మహిళ  ఈ వేరియంట్ కారణంగా మృతి చెందినట్లు వైద్య అధికారులు ధ్రువీకరించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆమెకు ఈ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. 

బండి సంజయ్ పాదయాత్రకు పేరు ఖరారు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మళ్లీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర అనే పేరు ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, కుటుంబ పాలన అంశాలతో ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. 

దేశంలో కొత్తగా 40 వేల కరోనా కేసులు...585 మరణాలు

 దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 40,120 పాజిటివ్ కేసులు వచ్చాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసులు 2.6 శాతం తగ్గాయి. నిన్న మహమ్మారి ధాటికి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 3.21 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,30,254 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకచించింది. 

Background

ఏపీకి చేరుకున్న 5.76 లక్షల కోవిషీల్డ్ డోసులు


ఏపీకి మరో 5.76 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో  గన్నవరం విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్లు వచ్చాయి. వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరంలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించారు. తర్వాత 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.