Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ABP Desam Last Updated: 27 Oct 2021 07:11 PM
Background
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుంది. నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి డాక్టర్ సుధ, భాజపా నుంచి...More
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుంది. నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేష్.. పోటీలో ఉన్నారు. రెండు పార్టీలు మరింతమంది కీలకనేతలను రంగంలోకి దించాయి. వైకాపా అభ్యర్థి తరఫున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా సభలు నిర్వహిస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు.హుజురాబాద్ లో పార్టీలు గెలుపు కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ కాక రేపుతున్నారు. ‘దళిత బంధు’పై ఈటల రాజేందర్ ఎన్నికల సంఘానికి రాసినట్లుగా ఓ లేఖ వైరల్‌గా మారింది. ‘హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ. 700 కోట్లు ఖర్చు పెడుతోంది, వివిధ పథకాల పేరుతో రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అందువల్ల ‘దళిత బంధు’ ఇతర పథకాలు ఆపేలా ఆదేశాలివ్వండి’ అంటూ ఈ నెల 24వ తేదీన ఈసీకి ఈటల రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ లేఖపై బీజేపీ, ఈటల అనచరులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలే ఫేక్ లెటర్ సృష్టించి ఈటలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కౌంటర్ గా బీజేపీ కూడా అది ఫేక్ లెటర్ అంటూ మరో లేఖని, అందులో ఉన్న విషయాలను పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను గమనిస్తే అందులో పేర్కొన్న పిన్ కోడ్ జగిత్యాల జిల్లాలోని ఒక మండలానికి చెందిందని అలాంటప్పుడు అది హైదరాబాద్ కి చెందిన అడ్రస్ ఎలా అవుతుందని సదరు వివరణలో బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా ఆ లేఖపై ఎలాంటి అధికారిక ముద్ర లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగం పేర్కొంది.టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని హోం శాఖ పేషీ అధికారులు చంద్రబాబు టీమ్‌కు సమాచారం అందించడంతో టీడీపీ అధినేత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. అయితే తాను జమ్మూకాశ్మీర్‌లో ఉండటంతో కలవటం కుదరలేదని చంద్రబాబుకు ఫోన్ కాల్ ద్వారా షా తెలిపినట్లు సమాచారం. ఏపీలో గంజాయి దందా, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులను అమిత్ షాకు వివరించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు
హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. ఈ నెల 30న హుజూరాబాద్ పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.