Breaking News Live Telugu Updates: బిహార్‌లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Aug 2022 08:30 PM

Background

వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల...More

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి- తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు

నల్లగొండలోని ఫారెస్ట్ పార్క్‌లో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.  కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. రోహిత్ అనే 21 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో నవ్య అనే అమ్మాయి వెంట పడుతున్నాడు. ఇతను ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఏడు నెలల నుంచి నవ్యను వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని... తననే ప్రేమించాలని టార్చర్ చేస్తున్నాడు.


మంగళవారం నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో నందుసాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళారు. అక్కడకు రోహిత్ కూడా వచ్చాడు. నవ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. ప్లాన్డ్‌గా వచ్చిన రోహిత్‌ నవ్యను పక్కకు తీసుకెళ్లి... తనతో తెచ్చుకున్న కత్తితో మెరుపుదాడి చేశాడు. ఆమెపై విచక్షణారహితంగా కడుపు, చేతులు, కాళ్ళు, మొహంపై పొడిచాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. తను తెచ్చుకున్న వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు.


ఇదంతా చూసిన సాయి, శ్రేష్ఠ వెంటనే పరుగెత్తుకొని వచ్చి నవ్యను అప్సత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని రోహిత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.