Breaking News Live Telugu Updates: కుప్పం ఘటనలో టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Jan 2023 03:41 PM
కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి

కూకట్‌పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్.ఓ.టి. పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి


ఓ కేసు దర్యాప్తు నిమిత్తం సిక్కుల బస్తీకి వెళ్లిన కానిస్టేబుల్ రాజు


గుర్తు తెలియని వ్యక్తి తల్వార్ తో దాడి .. గాయపడ్డ  రాజుని  ఆసుపత్రికి తరలించిన పోలిసులు...

ఫ్రస్టేషన్లో చంద్రబాబు పిచ్చివాడిగా మారాడు... మంత్రి అంబటి

ఫ్రస్టేషన్లో చంద్రబాబు పిచ్చివాడిగా మారాడు... మంత్రి అంబటి కామెంట్స్
11- మంది మరణాలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు కుప్పంలో రాజకీయం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ లో పిచ్చి వాడిగా మారాడని ఆయన అన్నారు. కుప్పంలో వీరంగం చేసే ప్రయత్నం చేశారని, సీఎంగా ఉన్న జగన్ పై రకరకాల భాషతో విమర్శించటం సరికాదని అంబటి సూచించారు. ప్రజల మరణాలకు కారకులవుతున్న వారిని, ఆయా పరిస్దితులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టే చర్యలు తీసుకుంటాన్నామని తెలిపారు.

కుప్పం ఘటనలో టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు

చిత్తూరు: కుప్పం ఘటనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు..


నిన్నటి కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు..


టీడీపీ నేతలపై హత్యయత్నంతో పాటుగా, పలు సెక్షన్ల కింద కేసు కేసులు
రాళ్లబుదుగూరు పోలీసులు..


మూడు ఏఫ్ఐఆర్ లు నమోదు చేసిన పోలీసులు..


టీడీపీ కార్యకర్తలపై 307, 353 నాన్ బెయిలబుల్  సెక్షన్ల కింద నమోదు..


దాదాపు 50 మందికిపైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు..


బుధవారం కుప్పంలో జరిగిన టిడిపి, పోలీసులు మధ్య ఘర్షణ


పలువురి టిడిపి నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు


మా కార్యకర్తలపై దాడులు చేసి మళ్లీ మా పైన కేసులు కడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు


మీరు పోలీసు వ్యవస్థలో ఉన్నారా లేకపోతే వైసిపి ప్రభుత్వం లో ఉన్నారా అంటూ పోలీసులపై మండిపడ్డ చంద్రబాబు


కార్యకర్తలపై రాళ్లతో లాఠీలతో దాడి చేస్తే మళ్లీ అదే కార్యకర్తలపై కేసులు కట్టడం పోలీసులకు సిగ్గుచేటు అన్నారు


మీరు ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భయపడే ప్రసక్తే లేదు


రాబోయే రోజుల్లో నాకు కూడా రక్షణ లేకుండా చేస్తారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డ చంద్రబాబు

Drugs Case Update: పోలీస్ కస్టడీకి డ్రగ్ స్మగ్లర్ మోహిత్

న్యూ ఇయర్ రోజున పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మైరాన్ మోహిత్ అలియాస్ డీజే మైరాన్, కృష్ణ కిషోర్ రెడ్డిలో ఒకరిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. వారిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ వేశారు. కృష్ణ కిషోర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం డీజే మైరాన్ మోహితన్ను కస్టడీకి అనుమతించింది. ఈరోజు కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం తిరిగి చంచల్ గూడా జైలుకు తరలిస్తారు.

Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబండి హల్ చల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి అంగన్వాడి 2 కేంద్రంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మామిడి పల్లిలో ఎలుగుబంటి అంగన్వాడి కేంద్రంలో ఉన్న పాలు, గుడ్లు, నూనె ధ్వంసం చేసి వెళ్ళిపోయింది. ఉదయం వెళ్లిన అంగన్వాడి టీచర్ బాలేశ్వరి ఈ విషయాన్ని గ్రహించి గ్రామస్తులకు, సూపర్ వైజర్ కి, పై అధికారులకు తెలియజేసింది. విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Secunderabad Cantonment Board: కంటోన్మెంట్ ప్రాంతం విలీనంపై కీలక పరిణామం

సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై కీలక పరిణామం జరిగింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ సెక్రటరీ, రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి సహా 8 మందితో కూడిన కమిటీని నియమించింది.

Chandrababu Kuppam Tour: కుప్పంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన

  • కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు..

  • పార్టీ క్యాడర్ లో ఉన్న కార్యకర్తలతో భేటీ కానున్న చంద్రబాబు..

  • బూత్ కన్వీనర్లను సమావేశంలో పాల్గొంటున్న చంద్రబాబు..

  • నిన్న జరిగిన ఘటనలో చంద్రబాబుపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు..

  • బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామన్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి..

  • ఇప్పటికే పలువురు నాయకులు మీద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్న పోలీసులు..

Background

ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 5 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అందులో పేర్కొంది. 


స్వల్ప వర్షాలు పడే అవకాశం


ఏపీలోనూ రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి బాగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విండ్ కన్వర్జన్స్ (గాలుల సంగమం) కారణంగా వైజాగ్ - శ్రీకాకుళం తీరం వెంబడి ఏర్పడుతున్న భారీ మేఘాలు నేరుగా కొనసీమ - కాకినాడ, అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి విస్తరించాయి. దీని వలన కొద్ది పాటి లేదా కొద్దిసేపు వర్షాలు పడనుంది. మధ్యాహ్నం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల స్వల్ప వర్షాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి


మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం


తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఈ మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ సాధారణంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు.


రేపు ఈ మూడు జిల్లాలతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు, ఎల్లుండి అదనంగా నిజామాబాద్, జగిత్యాల, మెదక్, హైదరాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.