Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - సీతారామరాజు వారసులకు సత్కారం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Jul 2022 12:26 PM

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  నైరుతి రుతుపవనాల...More

Modi Speech in Bhimavaram: ఇక్కడికి రావడం నా అదృష్టం, ఈ మట్టికి నా నమస్కారాలు - మోదీ

అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ పాటను గుర్తు చేశారు. అల్లూరి స్వాతంత్య్ర  సంగ్రామంతో యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సీతారామరాజు పుట్టిన ఈ నేలపై కలుసుకోవటం ఎంతో అదృష్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రదేశ ప్రజలు చేసిన ఆత్మబలిదానాలు, ఆదివాసీ ప్రజలు చూపిన తెగువ ఎంతో ప్రేరణనిచ్చిందని అన్నారు. ఇంత గొప్పచోటుకు రావటం తన అదృష్టమని మోదీ చెప్పారు. ఈ మట్టికి నమస్కరిస్తున్నానని అన్నారు.