Breaking News Live Telugu Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 30 Nov 2022 08:30 PM
Breaking News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కల్వకుంట్ల కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది. అమిత్ అరోరా ఈడీ తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. మొత్తం వంద కోట్ల రూపాయల డబ్బును సౌత్ గ్రూప్ సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. వంద కోట్ల రూపాయల డబ్బును అరేంజ్ చేసిన వారి జాబితాలో కవిత పేరు ను కూడా చేర్చింది ఈడీ. కవిత తో పాటు ఇదే జాబితాలో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా ఉన్నట్లు ఈడీ చూపించింది.36 మందికి 170 ఫోన్లను డ్యామేజ్ చేశారని ఈడీ రిపోర్టులో పేర్కొనగా అందులో కవిత పది ఫోన్లను డ్యామేజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ వంద కోట్ల ముడుపును విజయ్ నాయర్ అనే వ్యక్తికి సౌత్ గ్రూప్ తరపున అందించటానికి ట్రై చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరిస్తోంది.

ఏలూరు జిల్లా: కలపర్రు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ఏలూరు జిల్లా: కలపర్రు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు


భారీ గజమాలతో స్వాగతం పలికిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 


20 వేల మందికి పైగా వచ్చి స్వాగతం పలుకుతున్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు. 


కలపర్రు జాతీయ రహదారి పై వందాలాది బైక్ లతో చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అధినేత చంద్రబాబు. 


కిలోమీటర్ మేర కార్యకర్తలతో కిక్కిరిసిన ఏలూరు..


విజయవాడ జాతీయ రహదారి కలపర్రు టోల్ ప్లాజా వద్ద నుండి విజయరాయి వరకు సాగనున్న బైక్ ర్యాలీ 

గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - కవితకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్

‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్ ఇచ్చారు. 


 






పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినపుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినపుడు పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యం. నా పోరాటానికి మద్దతు తెలిపి, ప్రభుత్వ దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖలకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు.


 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో తుషార్‌కు ఊరట లభించింది. ఆయన్ని అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

Minister Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వచ్చిన సీబీఐ బృందం 

మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వచ్చిన సీబీఐ బృందం 


ఇటీవలే గంగుల కమలాకర్ ఇంటిపై ఆయన సోదరుని ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు


గ్రానైట్ వ్యవహారంపై విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు


రెండు రోజుల పాటు గ్రానైట్ సంస్థలు వ్యాపారుల ఇండ్లు కార్యాలయాలపై  ఈడీ, ఐటీ దాడులు సోదాలు

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. దాదాపు రూ.22 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Deeksha Diwas Rally: ఓయూలో దీక్షా దివాస్ ర్యాలీ

దీక్ష తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి సంవత్సరం నవంబర్ 29న  దీక్షా దివాస్ నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించి, కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్  దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఇదే దీక్షతో బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ వెన్నంటే ఉంటామని అన్నారు.

Ayyappa Mala: హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేటలో అయ్యప్ప స్వాముల నిరసన

అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థిని ఆ పాఠశాల టీచర్లు అడ్డుకున్నాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులకు విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, మాలధారులు పాఠశాల దగ్గరకు చేరుకుని నిరసన చేపట్టారు. ఓల్డ్ మలక్ పేట లోని మొహున్స్ గ్రామర్ స్కూల్ లో  టీచర్లు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.  అయ్యప్ప మాల ధరించి బడికి వచ్చాడు. స్కూల్ డ్రెస్ తో  బూట్లు ధరించి వస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని, లేదంటే వెళ్లిపోవాలని  టీచర్లు హెచ్చరించారు. దీంతో సదరు విద్యార్థి కుటుంబ సభ్యులతో చెప్పడంతో స్కూల్ ముందు అయ్యప్పస్వాములతో నిరసన చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్ తో వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రేణిగుంట నారాయణ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద మృతి- యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ నవదీప్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుననారు. సిపిఎం టీచర్స్ అసోసియేషన్ నాయుకులతో కలిసి నారాయణ కాలేజీ వద్ద ధర్నా చేశారు. నవదీప్ మరణానికి కారణమైన నారాయణ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో మరణాలు ఎన్ని ర్యాంకులెన్నీ అంటూ ప్రశ్నించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నారాయణ విద్యాసంస్థలను మూసివేయాలని డిమాండ్ చేశారు. 

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది.. మదనపల్లెలో ఏపీ సీఎం‌ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపధ్యంలో పాలక మండలి సమావేశం సమయాన్ని టిటిడి మార్పు చేసింది. అయితే ఈ‌ పాలక మండలి సమావేశంలో‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రధాన చర్చ జరగనుంది.. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులపై తేదీ ఖరారుపై చర్చించనున్నారు.. జనవరి మాసంలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది.. డిసెంబరు ఒకటో తారీఖు నుండి వీఐపీ బ్రేక్‌ దర్శనాల మార్పుపై పాలక మండలి మరో చర్చించనుంది.. ముడి‌సరుకుల కొనుగోలుపై పాలక మండలి చర్చ జరగనుంది.. ఇక అన్నమయ్య నడక మార్గం అభివృద్ధిపై పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధి శంకుస్ధాపన, మహా సంప్రోక్షణపై నిర్ణయం తీసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే అంశంపై పాలక మండలి చర్చించనుంది. ఇక చిన్నపిల్లల హృదయాలయంలో అభివృద్ధికి నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు. వీటితో పాటు పలు కీలక అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Background

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఉపరితల ఆవర్తనం బుధవారం (నవంబర్ 29) నాటికి మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా పయనించిందని అధికారులు తెలిపారు. మరోవైపు, డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అది పశ్చిమ వాయువ్యంగా పయనించి బలపడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇప్పుడు ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.


రాష్ట్రం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉన్నట్లుగా తెలిపారు. అటు మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.


అదంతా ఫేక్ తుపాను నమ్మొద్దు - ఏపీ వెదర్ మ్యాన్
‘‘డిసెంబరు మొదటి వారంలో దక్షిణాంధ్రలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వరకు మాత్రమే ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారి దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు వైపుగా వస్తోంది. దీని వలన డిసెంబరు 1 నుంచి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. నెల్లూరు నగరంలో కూడ కొన్ని వర్షాలుంటాయి. డిసెంబరు 2 నుంచి 4 మధ్యలో తిరుపతి జిల్లాలోని అన్ని భాగాలు ముఖ్యంగా తిరుపతి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము. అన్నమయ్య​, ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా, చిత్తూరు జిల్లాలోని కొన్ని వర్షాలను చూడగలము. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప జిల్లాలో తక్కువగానే వర్షాలుండనున్నాయి.


మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం ఉండదు. విశాఖ​, విజయవాడ​, కాకినాడ​, రాజమండ్రిలో కూడా వర్షాలు ఉండవు. ముఖ్యమైన గమనిక - విండీ యాప్ లో ఏదో తుఫాను ఆంధ్ర వైపుగా చూపిస్తూ ఉందని ఫేక్ న్యూస్ ఛానల్స్ చాలా దారుణంగా భారీ తుఫాన్ అని మరో పది రోజుల వరకు ఫేక్ న్యూస్ ని చెప్పనున్నారు. వాస్తవానికి ఈ సమయంలో ఏర్పడే తుఫాన్లు ఆంధ్రా వైపుగా రావడం చాలా అరుదు. ఇంకా చాలా సమయం ఉంది. దయజేసి విండీ ఆప్, ఫేక్ న్యూస్ గాలులను నమ్మి భయపడకండి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో నేటి (నవంబరు 29) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 15 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.