Breaking News Live Telugu Updates:  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Jun 2022 08:07 PM

Background

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అల్పపీడన ద్రోణి సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల...More

 పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. 12వ మైలురాయి సమీపంలో సోమవారం బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఈ ఘటనలో పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట, కాగువలస గ్రామస్తులు 15 మంది గాయపడగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరగనున్న బీఎస్పీ ఉత్తరాంధ్ర బహుజన చైతన్య సభకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.