Breaking News Live Telugu Updates: డబ్ల్యూపీఎల్ విజేత ముంబయి, ఫైనల్ లో దిల్లీపై విజయం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 26 Mar 2023 10:57 PM
డబ్ల్యూపీఎల్ విజేత ముంబయి, ఫైనల్ లో దిల్లీపై విజయం 

మహిళ ప్రీమియర్ లీక్ విజేతగా ముంబయి నిలిచింది. ఫైనల్ లో దిల్లీలో ముంబయి 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ 9 వికెట్ల నష్టానికి 131 చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబయి 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి ప్లేయర్స్ నాటి సీవర్ 60(నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్(37) పరుగులు చేశారు. 

ఎన్టీఆర్‌ పుట్టిన నేల‌పై అవార్డు అందుకోవడం మరచిపోలేను: రాఘవేంద్రరావు

విజయవాడ: రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు


వేదిక ఫంక్షన్ హాలులొ అతిధులు, ఆహ్వానితుల సమక్షంలో రాఘవేంద్రరావు ను సన్మానించి అవార్డు ని అందచేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులు


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు


విజయవాడ నగరం కళలకు ఎంతో ప్రసిద్ధి


ఇక్కడ నుంచి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది


నేను ఇక్కడే పుట్టాను... ఎన్టీఆర్‌ పుట్టిన నేల‌పై అవార్డు అందుకోవడం మరచిపోలేను


రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు


ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త  దర్శకులు‌ మంచి సినిమాలు తీస్తున్నారు


వాళ్ల దగ్గర కి వెళ్లి ‌కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాను


ప్రస్తుతం నేను ఏ సినిమాలకు దర్శకత్వం వహించడం‌ లేదు


కొత్తగా కె.ఆర్.ఆర్ అనే యూ ట్యూబ్ ఛానల్ పెట్టాను


దీని ద్వారా కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తున్నాం


ప్రతిభ ఉన్న వారిని గుర్తించి‌ వారితో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాం


చాలా మంది ఇక్కడ పని‌ చేసెందుకు ఆసక్తి చూపిస్తున్నారు


భారతదేశమే కాదు... ప్రపంచం మొత్తం మన‌ వైపు చూసేలా చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం కృషికి హ్యాట్సాఫ్


శాంతి నివాసం ద్వారా రాజమౌళి‌ కెరీర్ ప్రారంభించారు


స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నేటి వరకు రాజమౌళి హార్డ్‌ వర్కునే నమ్ముకున్నారు


మనకి ఆస్కార్ రావడంలో భాగస్వామ్యమైన అందరికి ధన్యవాదాలు

ఈ 27న సీఎం జగన్‌ ప్రకాశం జిల్లా కారుమంచి, విజయవాడ పర్యటన

26.03.2023
అమరావతి


రేపు (27.03.2023) సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా కారుమంచి, విజయవాడ పర్యటన


ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.55 గంటలకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. 11.15 – 11.45 కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం 12.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 


రేపు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌


ఎల్లుండి (28.03.2023) సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం పర్యటన


సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ చేరుకుని 7.00 – 8.00 గంటల మధ్య జీ 20 డెలిగేట్స్‌తో ఇంటరాక్షన్‌ కార్యక్రమం, అనంతరం అతిధులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డిన్నర్‌లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

వరుసగా రెండో ఏడాది వరల్డ్ ఛాంపియన్ గా నిఖత్ జరీన్

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 50 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లో 5-0 తేడాతో వియత్నాం బాక్సర్ గుయెన్ టాన్ పై విజయం సాధించింది. అయితే వరుసగా రెండో ఏడాది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖత్ ఛాంపియన్ గా నిలిచింది. 






 

Bhatti Vikramarka: ఆసిఫాబాద్ మండలంలో భట్టి విక్రమార్క దీక్ష

  • రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ మండలం బూరిగూడ గ్రామంలోని పాదయాత్ర క్యాంపు వద్ద సంకల్ప దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

  • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న సంకల్ప దీక్షకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

  • ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సంకల్ప దీక్ష చేయనున్న భట్టి

  • సంకల్ప దీక్షకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భట్టి

  • సంకల్ప దీక్షలో ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావ్, మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, పీసీసీ జనరల్ సెక్రెటరీ సరస్వతి, పీసీసీ సభ్యులు గణేష్ రాథోడ్, ఆసిఫాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Eleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై శనివారం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మార్చి 21వ తేదీన మీడియా సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురించి ఏలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేశారని, దీంతో మంత్రి పరువు ప్రతిష్ట దెబ్బతినేలాగా, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని మహేశ్వర్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రెండు పార్టీల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా మంత్రి పై తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తూ నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని అసత్య ఆరోపణలు చేశారన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి పై ఇష్టం వచ్చేలా మాట్లాడారని, ఇవన్నీ మంత్రి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, దీంతో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్వర్ రెడ్డిపై  117/23 U/s 153, 504, 505(2) ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Satyagraha Deeksha: కొద్దిసేపట్లో గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష ప్రారంభం..

  • కొద్దిసేపట్లో గాంధీ భవన్ దీక్ష ప్రారంభం..

  • రాహుల్ గాంధీని రాజకీయ కుట్ర పూరితంగా ఎంపీ పదవినుంచి తొలగించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దీక్షలు

  • గాంధీ భవన్ లో దీక్షలో పాల్గొననున్న ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు

D Srinivas: గాంధీ భవన్‌కు డి.శ్రీనివాస్

మాజీ పీసీసీ అధ్యక్షుడు, నిజామాబాద్ కు చెందిన కీలక నేత డి.శ్రీనివాస్ గాంధీ భవన్‌కు బయలుదేరారు. నేడు కాంగ్రెస్ నిర్వహించనున్న సత్యాగ్రహ దీక్షలో పాల్గొననున్నారు. 

LVM3 -M3 Racket: 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి..

LVM3 -M3 రాకెట్‌ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌ వెబ్‌ ఇండియా - 2 పేరుతో తయారు చేసిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చుతారు. భూమికి 450 కిలో మీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని 19.7 నిమి­షాల్లో పూర్తి చేయనున్నారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు ప్రణాళిక వేశారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ కలిసి వన్‌వెబ్‌ పేరుతో చేస్తున్న రెండో ప్రయోగం ఇదని ఇస్రో వర్గాలు తెలిపాయి.





LVM3 -M3 Racket: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్

LVM3 -M3 రాకెట్‌ ప్రయోగం నేడు ఉదయం 9 గంటలకు జరిగింది. శనివారం (మార్చి 25) ఉదయం 8.30 గంటలకు మొదలైన కౌంట్ డౌన్ మొదలైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. LVM3 -M3 రాకెట్‌ ద్వారా వన్‌ వెబ్‌ ఇండియా-2 పేరుతో 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యల్లోకి పంపించారు.

Background

ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల దూరంలో నడుస్తుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో తుపాను ప్రసరణ సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తక్కువగా ఉంటుంది.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా (మార్చి 27న) తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 28న మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.


వెదర్ వార్నింగ్స్ ఇవీ
నేడు (మార్చి 26) తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్,
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలులు (30-40 kmph) వేగంతో వీచే అవకాశం చాలా ఉంది. 27న కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.



హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.









 


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం ఉంటుందని తెలిపారు. దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఈ వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుందని, అరటి చెట్లకు నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడుతున్న వేళ చెట్ల కింద ఉండొద్దని చెప్పారు. కరెంటు స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
గత వారం రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ రోజు రాజధానితో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో ఆదివారం (మార్చి 26) మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.


ఛత్తీస్‌గఢ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. సమాచారం ప్రకారం, మార్చి 1, 23 మధ్య, విదర్భలో 14.2 మిమీ, మధ్యప్రదేశ్‌లో 20.5 మిమీ, ఛత్తీస్‌గఢ్‌లో 31.2 మిమీ వర్షం నమోదైంది. ఇది కాకుండా, అల్వార్, భరత్‌పూర్, ధౌల్‌పూర్, కరౌలి, శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు మరియు రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో, తేలికపాటి వర్షం మరియు వడగళ్ళతో పాటు గంటకు 20.40 కి.మీ వేగంతో బలమైన గాలులు కూడా పడే అవకాశం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.